Thursday, April 25, 2024
- Advertisement -

శ్రీలంక పరిస్థితి మనకు కూడా.. కేంద్రం స్పష్టత ?

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచ దేశాలను శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు ఏ స్థాయిలో కలవర పెడుతున్నాయో అందరికీ తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక ఇతర దేశాలకు గట్టి హెచ్చరికలే పంపిస్తోంది. దేశంలో ఆర్థిక పరిస్థితులు చేయి దాటకముందే మేల్కొవాలనే సంకేతాలను సూచిస్తోంది. దీంతో ఆయా దేశాలు శ్రీలంక పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు మార్గాలను వెతికే పనిలో పడ్డాయి. ఇక మనదేశం విషయానికొస్తే రోజురోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ దేశ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు చాలా సార్లు రూపాయి విలువ క్షీణిస్తు డాలర్ విలువ పెరుగుతూ వస్తోంది.

దీంతో మనదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. విదేశీ మారక ద్రవ్యనిల్వలు తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో పోరుగున ఉన్న శ్రీలంకనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని తాజాగా కేంద్ర విదేశంగా మంత్రి ఎస్ జైశంకర్ కూడా చెప్పుకొచ్చారు.. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన మనదేశంలో కూడా శ్రీలంక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. విదేశీ మారక ద్రవ్యనిల్వల కొరత కారణంగా పెట్రోల్, మెడిసన్, ఆయిల్ వంటి నిత్యవసర వస్తువులు దిగుమతి చేసుకోలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ జైశంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఎందుకంటే దాదాపుగా పది రాష్ట్రాలలో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రజెంటేషన్ రూపంలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జైశంకర్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలపై ఇప్పటికే రుణ భారం అధికంగా ఉందని తెలిపారు. అందువల్ల ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పుంజుకోకపోతే.. మన దేశంలో శ్రీలంక పరిస్థితులు ఏర్పడడం ఎంతో దూరంలో లేదని ఆయన చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి చేస్తే ఏకంగా కేంద్రప్రభుత్వమే దేశ ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో శ్రీలంక పరిస్థితులు తప్పవా ? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మోడి ప్రభుత్వం రాబోయే ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కుంతుందో చూడాలి.

More Like This

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

తైవాన్ చిచ్చు.. అమెరికా-చైనా వార్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -