Saturday, May 11, 2024
- Advertisement -

ప్రాణాలు కాపాడలేదు.. పరిహారంతో కొడుతున్న బాబు!

- Advertisement -

పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారాన్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు పదిలక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు.

రాయమండ్రిలోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షించిన చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు. ఒకవైపు తొక్కిసలాటలో గాయపడ్డ యాత్రికుల గురించి ఒక క్లారిటీ రాకనే బాబు వారికి పరిహారం ప్రకటించారు.

ఈ ప్రమాదానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకొంటామని.. పుష్కరాలు పూర్తి అయిన తర్వాత వారిపై చర్యలు ఉంటాయని బాబు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు పరిహారాలు ఎవరి కోసం?! ప్రాణాలే పోయాకా ఈ పరిహారంతో ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మృతులకు ఒక్కోరికి పదిలక్షల రూపాయలు చెల్లిస్తే వారి ప్రాణాలు వస్తాయా? లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని ముందే తెలుసు. ప్రభుత్వమే కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసింది. అందరినీ రమ్మని పిలిపించింది.

అలాంటిప్పుడు వారికి తగ్గట్టైన ఏర్పాట్లు చేయాలి కదా? కనీసం బారికేడ్లు ఏర్పాటు చేసి జనాలను నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు కూడా లేవు.  మరి ఇప్పుడు పరిహార ప్రకటన మాత్రం గట్టిగా చేసి చేతులు దులుపుకొంటున్నారు. మరి ఇందుకేనా ప్రభుత్వాలు ఉన్నది?! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -