- Advertisement -

చంద్రబాబుకు ఒక్క రోజు సరిపోతుందా?

- Advertisement -

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర గవర్నర్ ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వెళుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే దానికంటే ఒక రోజు ముందే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అందర్నీ ఆశ్చర్యానికి, అనుమానికి తావిస్తోంది. రేవంత్ రెడ్డి కేసులో మొదటి నుంచి చంద్రబాబు పాత్ర ఉందని తెలంగాణ మంత్రులు ఇప్పటికే ప్రచారం చేశారు.

దీనిపై కేంద్రం గవర్నర్ ను సమాచారం కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు గవర్నర్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి నివేదక తెప్పించుకున్నారని, దానిని ఈ నెల 10,11 తేదీలలో రాష్ట్రపతి, ప్రధాని లను కలిసి నివేదిక ఇవ్వబోతున్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక రోజు ముందే ఢిల్లీ వెళుతుండటం అందరి అనుమానాలను బలపరుస్తోంది. కానీ చంద్రబాబు ఏపి ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం అయా మంత్రులను కలవడానికే వెళుతున్నారని చెబుతున్నారు.ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ తీరుపై చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఏది ఏమైనా ఈ సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అది గవర్నర్ నరసింహన్ వెళ్ళే ముందు రోజే వెళ్ళటం చర్చనీయాంశమవుతోంది. 

రేవంత్ రెడ్డి కేసు వ్యవహారం కోసమే ఢిల్లీ పర్యటన అయితే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారనే చెప్పుకోవాలి?     

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -