Monday, May 6, 2024
- Advertisement -

విజయవంతంగా చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్రయాన్ 2…

- Advertisement -

చంద్రయాన్ 2 లో మరో కీలక ఘట్టం విజయవంతం అయ్యింది.చంద్రుడిని శోధించేందుకు భారత్ ఇటీవల చంద్రయాన్-2 వాహకనౌకను చంద్రుడి క‌క్ష్య‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో సైంటిస్టులు. చంద్రయాన్-2ను ప్రయోగించిన 29 రోజుల తర్వాత ఈ వాహకనౌక చందమామ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో ‘మేక్ ఆర్ బ్రేక్’గా వ్యవహరించే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ కీలక ఘట్టం ద్వారా చంద్రయాన్-2 చంద్రుని కక్ష్యకు 150 కిలోమీటర్ల దూరానికి చేరింది. ఇక్క‌డే ఆర్బిటార్ నుంచి విక్ర‌మ్ ల్యాండ‌ర్ వేరుప‌డ‌నున్న‌ది.సెప్టెంబర్ 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టడం ద్వారా ల్యాండింగ్ సాఫీగా జరిగేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగం చేయనున్నారు. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1.30-2.30 గంటల మధ్యలో ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ కానుంది.

ల్యాండర్ చంద్రుడిపై దిగిన నాలుగు గంటల తర్వాత ఆరు చక్రాలు కలిగిన రోవర్ బయటకు వస్తుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో పనిచేసే ఈ రోవర్ చంద్రుడిపై 14రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ తీసే ప్రతి విజువల్‌ని 15 నిమిషాల వ్యవధిలో భూమికి చేరవేస్తుంది. ఇక ఆ ఘ‌న‌తను సాధించిన నాలుగవ దేశంగా భార‌త్ నిలుస్తుంది. ర‌ష్యా, అమెరికా, చైనా దేశాల రోవ‌ర్లు ఇప్ప‌టికే మూన్‌పై దిగాయి. గ‌త ఏడాది ఇజ్రాయిల్ ఇదే ప‌రీక్ష‌లో విఫ‌లమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -