Tuesday, April 23, 2024
- Advertisement -

ఆనందయ్య మందుపై స్పందించిన చిన జీయర్ స్వామి

- Advertisement -

గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా మందుపై ఎన్నో వివాదాలు నెలకొంటూ వస్తున్నాయి. అయితే ఆయన మందుల ద్వార కొంత మంది ఆరోగ్యం బాగుపడితే మరికొంత మంది ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆనందయ్య మందుతో దుష్ప్రభావాల లాంటివి ఏవీ లేవని ఆయూష్‌ కమిటీ నిర్ధారించిందని అన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు.

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిని చిన్నజీయర్‌ స్వామి సందర్శించారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆనందయ్య విషయంపై చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ఆనందయ్య ఇస్తున్నది ఉచితంగానే కదా అని వ్యాఖ్యానించారు. క‌రోనా స‌మ‌యంలో మ‌నిషి జీవ‌న విధానంలో మార్పులు చేసుకుంటూ స‌రైన ఆహారం తీసుకోవాల‌న్నారు.

ప్రాణాలు నిలబెడుతున్న మందుపై వివాదాలెందుకన్నారు. ఆనంద‌య్య‌ ఔషధంతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్‌ కమిటీ నిర్ధారించిందని అన్నారు. ఉచితంగా ఔషధం ఇస్తుంటే అభ్యంతరమెందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సంక్షోభం వేళ ఇలాంటి వివాదాలకు తావివ్వకూడదన్నారు. అలోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీ కరించిదని,మంచి ఎక్కడున్నా స్వీకరించవచ్చని ఆయన పేర్కొన్నారు.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన..ఫరియా అబ్దుల్లా!

లాక్‌డౌన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో ట్వీట్

10 మంది బాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రభాస్ సినిమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -