Friday, April 26, 2024
- Advertisement -

లాక్‌డౌన్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలుగులో ట్వీట్

- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ అమల్లోకి తీసుకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులు బాటు ఇచ్చిన మిగిలిన 20 గంటలు కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నేటితో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించవొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ పొడగింపు వల్ల పేద ప్రజలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని లాక్ డౌన్ ముగిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

తాజాగా లాక్ డౌన్‌పై తన వ్యతిరేకతను మరోసారి తెలిపారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్ర కేబినెట్ ఆదివారం మరోసారి భేటీకానున్న నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. విశేషం ఏంటంటే.. ఆయన తన ట్విట్ తెలుగు లో చేయడం.. ఆయన అభిప్రాయంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఏకీభవిస్తున్నారు. లాక్‌డౌన్‌పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి.

లాక్ డౌన్ కంటే “మే 12” ముందు నుంచి కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయని ఆయన ట్విట్ లో పేర్నొన్నారు. లాక్ డౌన్ లేకపోయినప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలి. మాస్కుల వినియోగం, భౌతికదూరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే పోరాడవచ్చు.

అందుకు అనుగుణమైన జీవనవిధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలి అన్నారు. కేవలం 4గంటల సడలింపులతోనే 3.5కోట్ల మంది జీవనం వారాల పాటు కొనసాగించాలని భావించడం తగదని సూచించారు. లాక్ డౌన్ పొడిగించవద్దని సీఎం కేసీఆర్‌ను కోరారు. జనసమ్మర్ధాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి లేదా కోవిడ్ క్లస్టర్లలో మినీ లాక్ డౌన్ విధించాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -