ఓటీటీపై ఎర్రన్న సంచలన కామెంట్లు.. సీఎంలకు చురకలు..!

కరోనా ఎఫెక్ట్​తో థియేటర్లు మూతపడ్డాయి. త్వరలో థియేటర్లు తెరుచుకొనే చాన్స్​ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా సింగిల్​ స్క్రీన్​ థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రస్తుతం లాక్​డౌన్​ ఎత్తేసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకొనే పరిస్థితి లేదు. మరోవైపు ఓటీటీలు థియేటర్ల పాలిట శాపంగా మారాయి

ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంపై ఒక్కో నటుడు గొంతు విప్పుతున్నారు. నిన్న నేచురల్​ స్టార్​ నానీ థియేటర్ల తెరుచుకొనేందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు.. థియేటర్​ టికెట్ల విషయంలో ఎందుకుంత కఠినంగా ఉంటున్నాయని ఆయన ప్రశ్నించారు.

తాజాగా ఓటీటీ విషయంపై పీపుల్స్​ స్టార్​ ఆర్​ నారాయణ మూర్తి స్పందించారు. విజయవాడలోని ఐలాపురంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి నిజమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం అందించాల్సిన బాధ్యత కూడా మనమీద ఉంది కదా. ఇటీవల నారప్ప అనే సినిమా ఓటీటీలో విడుదలైంది. మంచి టాక్​ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాను కేవలం 25 శాతం మంది ప్రేక్షకులు మాత్రమే చూశారు. మిగిలిన 75 శాతం మంది చూడలేదు. అందుకు కారణం వారికి ఓటీటీలో అందుబాటులో లేదు. థియేటర్​ అంటే ఓ సందడి. థియేటర్​లో సినిమాలు చూడటం ఓ ఆనందం. దాన్ని ప్రేక్షకులకు దూరం చేయకూడదు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జోక్యం చేసుకోవాలి’ అంటూ ఆర్​ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.

Also Read : థియేటర్లపై ఎందుకీ ఆంక్షలు.. నానీ సంచలన వ్యాఖ్యలు

Related Articles

Most Populer

Recent Posts