వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందె. నవంబర్ 6 నుంచి ఆరునెలలపాటు ప్రజాక్షేత్రంలోకి జగన్ వెల్లనున్నారు. అయితె ఈపాదయాత్రనుచూసి టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు పుడుతోంది. బాబునుంచి చోటా నాయకుల వరకు అందరు విమర్శలు చేసినవారె. చివరిసారిగా పాదయాత్రకు ఆటంకాలు సృస్టించేందుకు పూనుకున్నారు.
అయితె ఇప్పుడు మరో కొత్త వాదన తెరపైకీ తీసుకొస్తుంది టీడీపీ ప్రభుత్వం. ప్రజాసమస్యలను తెలుసుకొనేందుకు రాజకీయ పార్టీలు ప్రభుత్వాల అనుమతి తీసుకోవాలా.? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్రలు చేస్తె అనుమతి ఇస్తాయా అంటె ఇవ్వవు. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి ఎదురవుతోంది.
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని మాట తప్పడంతో ముద్రగడ చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్నారు. పాదయాత్ర చేయడానికి అనుమతి తప్పనిసరి అంటు సలహాలిచ్చారు. జనంలోకి ఓ నాయకుడు వెళ్ళాంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలన్నది ఏ నైతిక విలువలకు నిదర్శనమట.?
జగన్ పాదయాత్రకీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.. అన్న మాట, సాక్షాత్తూ డీజీపీ నోట వచ్చింది. దాంతో, అంతా అవాక్కయ్యారు. ‘అనుమతి తీసుకుని పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు..’ అంటూ ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. శాంతిబధ్రతలను కాపాడటం డీజీపీగా ఆయన బాధ్యత. రాజకీయపార్టీల కన్నాక వాటికి కొన్ని కార్యాచరణలుంటాయి.
బోడిగుండు… మోకాలికి లింకు పెట్టినట్లు ముద్రగడ పాదయాత్రకి… జగన్ పాదయాత్రకి లింక్ పెడితె ఎలా. గతంలో బాబు పాదయాత్ర చేశారు, రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేశారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతి తీసుకోవడం అనేది పార్టీ వ్యూహాలను బట్టి ఉంటుంది . జగన్ అంటె చంద్రబాబులో ఉన్న భయమో డీజీపీ నోట ‘హెచ్చరిక లాంటి సూచన’గా వచ్చిందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్ ఎలా పాదయాత్ర చేస్తారు.? అసలంటూ కోర్టు అనుమతిస్తేనే కదా.?’ అంటూ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే, వ్యాఖ్యానించిన ఘనులు చంద్రబాబు అండ్ టీమ్. అదొక్కటి చాలు, జగన్ పాదయాత్ర అంటే చంద్రబాబు సర్కార్ ఎంత బయమో చెప్పాల్సిన పనిలేదు. డీజీపీ ద్వారా హెచ్చరికలు బాబు పంపాలనుకున్నారు అది కాస్త బెడిసి కొట్టింది. దీనితో బాబుకున్న భయం మరోసారి బట్టబయలైంది.
