Monday, May 13, 2024
- Advertisement -

ట్రంప్ నిర్ణ‌యంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

- Advertisement -
Donald Trump’s says budget to cut foreign aid, may impact Pakistan

ప్ర‌పంచంలో పాకిస్థాన్ ఉగ్ర‌వాదానికి పుట్టినిల్లు అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం.ఉగ్ర‌వాదాన్ని నిర్మూలిస్తామ‌ని అమెరికా నుంచి స‌హాయంగా వ‌చ్చే నిధుల‌ను భార‌త్‌లో అల్ల‌క‌ల్లోలం సృస్టించేందుకు వాటిని వినియేగిస్తోంది.ఉగ్ర‌వాదాన్ని నిర్మూలిస్తామ‌ని క‌ప‌ట నాట‌కాలు అడుతున్న దుష్ట‌పాక్ ఆట‌లు ఇక సాగ‌వు.సౌదీ అరేబియాలో జరిగిన సదస్సులో భారత్ ను ఉగ్రవాద బాధిత దేశంగా పేర్కొంటు … పాక్ కు మరోషాక్ ఇచ్చారు.

అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ సాగిపోతున్నారు.తాజాగా పాకిస్తాన్‌కు ఉగ్ర‌వాద నిర్మూల‌నకు ఇస్తున్న నిధుల‌ను రుణాలుగా మార్చాల‌ని ట్రంప్ రుణంగా మార్చేయమని అధికారులను ఆదేశించారు. మేరకు తన హయాంలోని మొట్టమొదటి బడ్జెట్‌ లో తగిన మార్పులు చేయాలంటూ యూస్ కాంగ్రెస్‌ కు ట్రంప్ సిఫారసు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో విదేశాలకు ఇచ్చే నిధులే అమెరికాకు గుదిబండగా మారాయని పేర్కొన్న ట్రంప్…ఇప్పుడు వాటిని రద్దు, లేదా అప్పుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. నిర్ణ‌యం అమ‌లు అయితే పాకిస్థాన్ కోర‌లులేని పాములా త‌యార‌వుతుంది.
అందులో భాగంగా, పాకిస్తాన్‌ తోపాటు పలు దేశాలకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ‘లోన్’ (అప్పు) గా మార్చాలని సూచించారని వైట్‌ హౌస్‌ లో బడ్జెట్ మేనేజ్‌ మెంట్ డైరెక్టర్ మైక్ ముల్వానీ తెలిపారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఈ జాబితా నుంచి ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలకు మినహాయింపునిచ్చినట్టు తెలుస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}
అమెరికా నిర్ణ‌యం అమ‌లు అయితే డ్రాగ‌న్ దేశం స్పీడ్‌కు ముక్కుతాడు ప‌డిన‌ట్లే.చైనా భారీగా చేస్తున్న ధనసాయం కూడా భవిష్యత్ లో అప్పుగా మారే ప్రమాదం ఉందని వివిధ దేశాలు భావించే అవకాశం ఉంది. ధ‌నిక దేశ‌మ‌న్న అహంకారంతో భార‌త్‌ను ఇరుకున పెట్టేందుకు భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో లక్షల కోట్ల ఉచిత పెట్టుబడులు పేరుతో చైనా చేస్తున్న దౌత్య రాజకీయాలకు చెక్ పడే అవకాశం ఉంటుంది.ట్రంప్ నిర్ణ‌యంతో ఒకే దెబ్బ‌కు రెండుపిట్ట‌ల‌న్న‌మాట‌.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. స‌రిహ‌ద్దుల్లో పాక్ శిభిరాల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సైనిక ద‌ళాలు
  2. కుటిల పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భార‌త్ స‌న్న‌ద్ధం…
  3. కుల‌భూష‌న్ జాద‌వ్‌ను ఇండియాకు తీసుకొస్తాం….
  4. పాకిస్థాన్ అణు క్షిప‌ణుల ర‌హ‌స్య స్థావ‌రం బ‌ట్ట‌బ‌య‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -