- Advertisement -

ఐదేళ్ల కనిష్ట స్థాయికి టోకు ద్రవ్యోల్బణం

- Advertisement -

ఇంధన, ఆహారోత్పత్తుల ధరలు శాంతించడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ అక్టోబర్ నెలలో ఐదేళ్ల కనిష్టానికి దిగజారింది. 1.77 శాతంగా నమోదైంది. దీంతో వచ్చేనెలలో రిజర్వ్ బ్యాంక్ జరపబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

అక్టోబర్ నెలకుగాను ఈ వారంలో విడుదలైన చిల్లర ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 5.52 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. కాగా, డబ్ల్యుపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 2.38 శాతానికి క్షీణించింది. గడిచిన ఐదు నెలలుగా ద్రవ్యోల్బణం గణాంకాలు పడిపోతుండగా, గత ఏడాది అక్టోబర్‌లో ఇది 7.24 శాతంగా ఉండటం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -