సరిహద్దు రచ్చ.. సద్దుమనిగేనా ?

గత రెండు సంవత్సరాలుగా భారత్ చైనా మద్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్ లోని లైన్ ఆఫ్ యక్చువల్ కంట్రోల్ వద్ద ఈ వివాదం ఏర్పడింది. ఇటు భారత్, అటు చైనా రెండు దేశాలు కూడా సరిహద్దు విషయంలో వెనక్కి తెగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే భారత్ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చూస్తుంటే.. చైనా మాత్రం కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా తన బలగాలను భారీ మొత్తంలో మోహరించింది. యుద్దానికి సై అన్న సంకేతాలను చైనా పంపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే భారత్ కూడా చైనాకు ఏమాత్రం తీసిపోకుండా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దం అనే సంకేతాలను పంపిస్తోంది. . అయితే సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చూస్తున్న భారత్.. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాల్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తోంది. ఈ అంశంపై మార్చి లో ఇరు దేశాల మద్య చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ చర్చలు కొంత వరకు ఫలించినప్పటికి, ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు.. దీంతో మరోసారి ఇరు దేశాలు చర్చలకు సిద్దమయ్యాయి. జూలై 17 న భారత వాస్తవాధీన రేఖ ( ఎల్ ఏ సి ) వద్ద ఈ చర్చలు జరగనున్నాయి.

ఈ చర్చల్లో రెండు దేశాలకు సంభంధించిన సైనిక ఉన్నతాధికారులు మరియు ఇరు దేశాల విదేశీ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. మరి ఈ సారి చర్చలో లద్దాఖ్ లోని కీలక ప్రాంతాల్లో చైనా మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు దేప్సాంగ్ బల్జ్, దెంచక్ వంటి ప్రాంతాల ఆధీనంపై కూడా చర్చిస్తారు. మరి ఈ చర్చల వల్ల ఇరు దేశాల మద్య ఉన్న సరిహద్దు వివాదం సద్దుమనుగుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

రష్యా విషయంలో భారత్ కు ఒత్తిడి..!

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

చైనా నిర్ణయంతో .. భారత్ కు షాక్ !

Related Articles

Most Populer

Recent Posts