Saturday, April 27, 2024
- Advertisement -

రష్యా విషయంలో భారత్ కు ఒత్తిడి..!

- Advertisement -

గత కొన్నేళ్లుగా భారత్, రష్యా మద్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగాను, మరియు స్థిరంగాను కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ రెండు దేశాల మద్య ఉన్న స్నేహాన్ని అమెరికా, చైనా వంటి దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అమెరికాతో భారత్ కు సత్సంబందలు ఉన్నప్పటికి, రష్యాతో ఉన్నంత స్నేహం అమెరికాతో లేదనే చెప్పాలి. రష్యా ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో కూడా రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు నాటో సభ్యదేశాలు గట్టిగానే స్పందించాయి. .

అయితే భారత్ మాత్రం తటస్థంగా వ్యవహరించింది. ఇది అమెరికాకు అసలు నచ్చలేదు. రష్యాకు వ్యతిరేకంగా భారత్ స్పందించాలంటూ ఆ మద్య అమెరికా బహిరంగంగానే చెప్పింది. అయినప్పటికి భారత్ రష్యా విషయంలో తటస్థంగానే వ్యవహరించింది. ముఖ్యంగా మన దేశం ఇందన దిగుమతులకు రష్యాకే అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతామండలి సమన్వయ కర్త జాన్ కిర్బి మాట్లాడుతూ.. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం రష్యాపై ఆంక్షలు విధించడంలో వెనకడుగు వేస్తోంది అని అన్నారు.

భారత్ తమకు కూడా వ్యూహాత్మక భాగస్వామి అని, భారత్ తో సత్సంబంధాలు కొనసాగించేందుకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని జాన్ కిర్బి అన్నారు. అయితే అమెరికా జాతీయ భద్రత మండలి సమన్వయ కర్త జాన్ కిర్బి చేసిన వ్యాఖ్యలను విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తీ.. భారత్ కు అమెరికా స్నేహం ఉంది.. అందువల్ల రష్యాతో భారత్ స్నేహ బంధని తెంచుకోవాలి ” అని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అమెరికా వంకర బుద్ది భారత్ కు బాగా తెలుసు.. అందువల్ల అమెరికా మాటలను భారత్ పట్టించుకునే అవకాశం లేదు. ఏది ఏమైనప్పటికి భారత్ రష్యా స్నేహబంధాన్ని చూసి అమెరికా జీర్ణించుకోలేకపోతోంది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

పాపం.. అఫ్ఘానిస్తాన్ పై ప్రకృతి కోపం !

చైనా అమెరికా వార్.. కారణం ఆదేనా ?

చైనా నిర్ణయంతో .. భారత్ కు షాక్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -