Saturday, April 20, 2024
- Advertisement -

చైనా నిర్ణయంతో .. భారత్ కు షాక్ !

- Advertisement -

ప్రపంచ దేశాలన్నిటిలోకెల్ల చైనా కాస్త భిన్నమైనదని మనందరికి తెలుసు. ఆదేశంలోని విధానాలు, టెక్నాలజీ, అన్నీ కూడా ఇతర దేశాలకు భిన్నంగానే ఉంటాయి. సొంత ఐడెంటిటీ ఉన్న దేశాల జాబితాలో చైనా ముందు వరుసలో ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ ఇతర దేశాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది చైనా. తాజాగా చైనా అధ్యక్షుడు తీసుకున్న ఓ నిర్ణయం.. మన దేశంతో పాటు మరికొన్ని దేశాలకు షాక్ ఇచ్చేలా ఉంది. ఏ దేశంలోనైనా ఆ దేశం యొక్క సైనిక అనుమతులు అన్నీ కూడా దేశాద్యక్షుడి అధీనంలో ఉంటాయి. కానీ ప్రస్తుతం చైనా సైనిక అనుమతులన్నీ కూడా సైన్యాధికారులకే అప్పగించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తాజాగా వెల్లడించారు.

ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా లో కూడా కథనాలుగా వెలువడ్డాయి. ఇలా సైనిక అనుమతులన్నీ దేశాధ్యక్షుడి అధీనంలో కాకుండా సైన్యాధికారుల అధీనంలో ఉండడం వల్ల .. ఎలాంటి చర్యలకైనా పాల్పడే అవకాశం ఉంది. దేశాధ్యక్షుడి అనుమతి కోసం ఎదురు చూడకుండా సైన్యాధికారులు వారియొక్క వ్యూహాలను, దుశ్చర్యలను సొంతంగా అమలుపరిచే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

చైనాకు పొరుగున ఉన్న భారత్, కొరియా , థాయ్ లాండ్, తైవాన్ సింగపూర్, భూటాన్, అమెరికా వంటి తదితర దేశాలు చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో కాస్త ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇకపై అధ్యక్షుడి అనుమతి లేకుండానే చైనా సైన్యం ఎవరిపై అయిన సైనిక చైర్య చేపట్టవచ్చు. సైనిక చర్య అంటే పరోక్షంగా యుద్దమే అని భావించాలి. ఈ ఆదేశాలతో చైనా సైన్యం మరింత రెచ్చిపోయే అవకాశం కూడా లేకపోలేదు. మన దేశ సరిహద్దుల్లో చైనా తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో చైనా సైన్యం మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పీకల్లోతు కష్టాల్లో పాక్.. దివాళా అంచున దేశం ?

విద్యుత్ సంక్షోభంలో ఆస్ట్రేలియా.. భారత్ కు పెను ముప్పు ?

భారత్ అంటే రష్యాకు ఎంత ప్రేమో !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -