కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మాజీ మంత్రి డీకే శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. పార్టీకి అనేక ఆపరేషన్లలో వెన్నుదన్నుగా ఉంటూ కీలక నేతగా చక్రం తిప్పుతున్న డీకేశితో పాటు కాంగ్రెస్‌పార్టీకి షాక్ తగిలింది . మనీ లాండరింగ్ కేసులో నిన్న ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
గత శుక్రవారం ప్రారంభమైన విచారణ ఆదివారం మినహా మంగళవారం వరకు కొనసాగింది. సుమారు 29 గంటల పాటు డీకేశిని ఈడీ విచారించింది. విచారణలో డీకే సహకరించలేదని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో ఐటీ దాడుల్లో ఢిల్లీలోని ఆయన నివాసంలో రూ. 8.59 కోట్ల నగదు లభించడంతో డీకేశిపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది.ఈ కేసుకు సంబంధించి ఈడీ డీకేను విచారణ చేస్తూ వస్తోం.
డీకే శివకుమార్ అరెస్టుతో పలుప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్షపూరిత చర్యేనని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. బెంగళూరు, బళ్లారి, దావణగెరె, శివమొగ్గ, సింథనూరు తదితర ప్రాంతాలతో పాటు, శివకుమార్ అనుచరవర్గం అధికంగా ఉన్న చోట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ నేతను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు.
డీకేశి అరెస్టు నేపథ్యంలో బెంగళూరుతో పాటు మండ్య, హాసన్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గొడవలు జరగకుండా నిఘా వేసింది. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది.
