చిక్కుల్లో మోహన్‌లాల్

- Advertisement -

మలయాళ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. మానీలాండరింగ్ కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో మోహల్ లాల్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు.

2021లో, పురాతన వస్తువులను విక్రయించినందుకు పది కోట్ల రూపాయల మోసానికి మాన్కల్ పాల్పడ్డాడు. ఆరుగురు నుంచి ఈ మొత్తాన్ని స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కేరళలో ఉన్న మాన్సన్‌ ఇంటికి మోహన్‌ లాల్‌ ఒకసారి వెళ్లినట్లు సమాచారం.

- Advertisement -

అయితే మోహన్ లాల్ ఎందుకు వెళ్ళారన్న దానిపై ఈడీ దర్యాప్తు చేయనుంది. మోన్సన్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువులు పరిశీలించగా చాలా వరకు నకిలీవని తేలింది.

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

చిక్కుల్లో నటి ముంతాజ్

తాజ్ మహల్ స్థలం మాదే

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -