Sunday, May 5, 2024
- Advertisement -

రైతుల దెబ్బకి .. టోల్ ప్లాజాలు అబ్బా…!

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను ఉద్ధృతం చేశారు రైతులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సమీప సరిహద్దుల్లోని టోల్​ ప్లాజాలను మూసివేశారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వాహనాలను పంపిస్తూ.. నిరసన తెలుపుతున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఢిల్లీ-హరియాణా సరిహద్దు కర్నాల్​లోని బస్తారా టోల్​ ప్లాజాను మూసివేసి.. వాహనాలను అనుమతిస్తున్నారు అన్నదాతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. అలాగే.. అంబాలలోని శంభు టోల్​ప్లాజాను కూడా మూసివేశారు.

శనివారం తెల్లవారుజామునే హిసార్​-ఢిల్లీ ఎన్​హెచ్​-9 రహదారిపై ఉన్న మయ్యడ్​ టోల్​ప్లాజాను మూసివేశారు రైతులు. వాహనాలను ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అనుమతిస్తున్నారు. ఈ టోల్​ప్లాజా పంజాబ్​, రాజస్థాన్​లను దిల్లీతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -