Wednesday, April 24, 2024
- Advertisement -

తగ్గిన పసిడి.. అదే బాటలో వెండి!

- Advertisement -

కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడి ధర తగ్గుముఖం పడుతూ వస్తుంది. కొన్ని సార్లు ఈ ధరలు పెరిగినా.. పెద్దగా ప్రభావం మాత్రం చూపడం లేదు. దానితో పాటు వెండి ధర కూడా కాస్త నేల ముఖం చూస్తుంది. ప్రస్తుతం పసిడి కొనుగోలు చేసేవారికి ఇది శుభవార్త అనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి.  బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి.  అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం.  దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి.  

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400 దగ్గర ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.47,350గా ఉంది. మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరరూ.46,750 దగ్గర కోనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసడి ధరలు ఈవిధంగా ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,750 దగ్గరగా కొనసాగుతుంది. బంగారం ధర నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.

సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్య చేసిన బండి!

గవర్నర్ బండారు దత్తాత్రేయను నెట్టెసిన ఎమ్మెల్యేలు

5 రాష్ట్రాలకి మోగిన ఎన్నికల భేరి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -