లక్ష్మణ ఫలం తో చక్కటి ఆరోగ్యం పొందండి!

- Advertisement -

లక్ష్మణ ఫలం చెట్టు అనోనేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం ‘ఆనోనా మ్యూరికాటా’. ఆంగ్లంలో సవర్ సోప్ లేదా గ్రావియోలా అందురు. వీటి ఆకులు సీతాఫలం చెట్టు ఆకులవలె కాకుండా నున్నగా ఉంటాయి. ఇది అచ్చం సీతాఫలం తిన్నట్టే ఉంటుంది కానీ.. దీంట్లో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఎక్కువే అని చెప్పుకోవాలి. ఇరవై ఐదు నుంచి ముఫ్పై అడుగుల ఎత్తు వరకూ పెరిగే పొదలాంటి చిన్న సతతహరిత వృక్షం ఇది. దీని ఆకులు సీతాఫలం ఆకుల్లాగే ఉన్నా కొంచెం పెద్దగా ఉంటాయి.

లక్ష్మణఫలం ఇసుక నేలలలో బాగా పెరుగుతుంది అన్ని నేలలోనూ పెంచుకోవచ్చు అయితే నీరు నిలవకూడదు. మట్టి మిశ్రమంలో కంపోస్టు, వర్మీకం పోస్టు, వేపపిండి, ఇసుక వంటివి కలిపి మొక్క ఆరోగ్యంగా దిగేలా చూసుకోవాలి. ఇది మన ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా కాపాడుతుంది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో ఆనోనా మ్యూరికాటా అని పిలుస్తారు.

- Advertisement -

మొత్తం 12 రకాల కేన్సర్ కారక కణాలను ఈ పండు తరిమికొడుతుందట. ఒక్క పండే కాదు.. లక్ష్మణఫలం చెట్టు బెరడు, ఆకులు, విత్తనాలు.. ఇలా చెట్టు మొత్తం ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగపడుతుందట. 

ఈ పండులో విటమిన్ సీ, విటమిన్ బీ1, విటమిన్ బీ2.. పుష్కలంగా లభిస్తాయట. కండరాల నొప్పి తగ్గడానికి, బాలింతల్లో పాల వృద్ధికి, పార్శపు నొప్పి, షుగర్, మూత్రకోశ వ్యాధుల చికిత్సలోనూ లక్ష్మణఫలాన్ని ఉపయోగిస్తారట.ఇప్పుడిప్పుడు ఈ పండు లాభాలు తెలిసి ఆంధ్రాలోని విశాఖపట్టణం ఏరియాలో వీటిని సాగు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వీటిని పండిస్తున్నారట.

సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్య చేసిన బండి!

ప్రభాస్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ ?

5 రాష్ట్రాలకి మోగిన ఎన్నికల భేరి..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -