Thursday, May 2, 2024
- Advertisement -

ఉద్యోగానికి రాజీనామా చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ‌…త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి

- Advertisement -

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసులను విచారించడం ద్వారా ఉమ్మడి ఏపీలో లక్ష్మీనారాయణ బాగా పాప్యులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా పని చేస్తున్నారు.

ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖలు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాజీనామా దరఖాస్తును ఆమోదించాల్సి ఉంది. మరోవైపు, లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే, పదవీ విరమణకు ముందే ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అప్పట్లో వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్‌ కేసుల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తులో లక్ష్మీనారాయణ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జగన్ కేసుల్లో వివాదాస్పద అధికారిగా కూడా ప్రచారంలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -