Saturday, May 11, 2024
- Advertisement -

ఏపీనీ ముంచెత్తిన వ‌ర‌ద‌లు…రాజ‌ధాని ప్రాంతంలో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు

- Advertisement -

కేర‌ళ‌ను అత‌లాకుతంలం చేసిన వాన‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఉభ‌య‌గోదావ‌రి, కృష్ణా,గుంటూరుతోపాటు ఉత్త‌రాంధ్ర జిల్లాలు అత‌లా కుత‌లం అయ్యాయి.

ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వానలు, వరదలతో జనజీవనం కూడా స్తంభించగా.. కొన్ని జిల్లాల్లో గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఇక పంట పొలాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. భారీ వర్షానికి తోడు.. గోదావరికి వరద ఉధృతి పెరుగుతండటంతో లంక గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. చింతూరు –వీఆర్‌ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలోని 11 గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. కోనసీమలోని మరో 20కిపై గ్రామాలది ఇదే పరిస్థితి. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది.

కృష్ణా జిల్లాను వర్షం ముంచెత్తింది. విజయవాడలో కూడా భారీ వర్షాలతో వన్‌టౌన్‌‌లోని లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. మైలవరం నియోజకవర్గంలో నల్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి రెండు అడుగులమేర నీరు ప్రవహిస్తుండటంతో నందిగామ-చందర్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్లేరు, వైరా, మున్నేరు వాగులు పొంగి ప్రవహించడంతో వీర్లపాడు- దొడ్డేదేవరాపాడు, పల్లెంపల్లి -దామలూరుల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. కాజ్ వేపై భారీగా వరద నీరు చేరడంతో నందిగామ, వీర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిం

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. విశాఖ జిల్లాలో కుండపోత వాన పడింది. విశాఖలోని జ్ఞానాపురం, వన్‌టౌన్, పాత పోస్టాఫీసు, రైల్వే న్యూకాలనీ, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, బీచ్‌ రోడ్డులో రోడ్లు నీటమునిగాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

భారీ వర్షాలతో రాజమండ్రిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చిచేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -