Saturday, May 4, 2024
- Advertisement -

జపాన్‌ ఆర్కిటెక్ట్ పుమిహికో మాకీ బాబు పై సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
Japanese architect Fumihiko Maki Sensational Comments on AP Government

ఇన్నాల్లు ఏపీలో సుప‌రిపాల‌నను అందిస్తున్నామ‌ని ఇత‌ర‌దేశాల‌కు వెల్లిన‌ప్పుడ‌ప్పుడ‌ల్లా సొంత‌డ‌బ్బా కొట్టుకొనే చంద్ర‌బాబ‌కు పెద్ద‌షాకే త‌గిలింది. ఏపీలో అత్యంత చెత్త‌పాల‌న కొన‌సాగుతోంద‌ని….అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఆర్కిటెక్ట్ ప్రముఖుడుజపాన్‌కు చెందిన మాకీ అండ్ అసోసియేట్స్‌ చైర్మన్‌ పుమిహికో మాకీ రాసిన ఆర్టిక‌ల్ ఏపీ పరువును గంగ‌పాలు చేసింది.

ఈ ఆర్టిక‌ల్ ఆర్కిటెక్ట్‌లు ఫోర్బ్స్‌ మేగజైన్‌లా భావించే ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ అనే మ్యాగజైన్‌లో ప్ర‌చురిత మ‌వ‌డంతో తీవ్ర క‌ల‌క‌లానికి తెర‌తీశాయి. ఇన్నాల్లు నిజాయితీ పాల‌న అందిస్తున్నామ‌ని బాబ చెప్ప‌కున్న మాట‌లు డొల్లని తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఏముఖం పెట్టుకొని పెట్టుబ‌డులును ఆక‌ర్శించేందుకు విదాశాల‌కు వెల్తార‌నీ ప్ర‌తిప‌క్షాలు దుమ్మ‌త్తిపోస్తున్నాయి. ఈ ఆర్టిక‌ల్ తో బాబు డిఫెన్స్‌లో ప‌డ్డార‌నే ఇర్త‌లు వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దారుణమైన, చెత్త పాలన కొనసాగుతోందని ఆర్టికల్‌లో వివరించారు. అక్కడ పనిచేయడం ఏమాత్రం వీలుకాదని తేల్చిచెప్పారు. తాము బీహార్‌లోనూ పనిచేశామని.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే బీహార్‌లో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని మాకీ వ్యాఖ్యానించారు.ఐదేళ్ల కాలంలో తన సంస్థ రెండు విరుద్ధ అనుభవాలను చవిచూసిందని మాకీ వెల్లడించారు. బీహార్‌లో అడుగు పెట్టే సమయంలో అక్కడ పనిచేయడం చాలా కష్టమన్న ప్రచారం ఉండేదన్నారు. కానీ బీహార్‌లో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలు మాత్రం దారుణంగా ఉన్నాయని ఆందోళనవ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ అంటూ ఏపీ (ఆంధ్రప్రదేశ్) కి సంబంధించిన పోస్టర్లు కనిపిస్తుంటాయి.

బిహార్‌ రాష్ట్రం ఒక చక్కటి ప్రణాళికతతో, సుపరిపాలనతో దూసుకుపోతుండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం పూర్తి అయోమయంగా ఏ అంశంపై అవగా హన లేకుండా గజిబిజి వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ఇక్క‌డ ఏప‌ని చేయాల‌న్నా రాజ‌కీయాలు జోక్యంలేనిదే ప‌నులు సాగ‌వ‌న్నారు. ఏ ఒప్పందాలు చూసినా అన్నీ లోపాయికారి ఒప్పందాలే జ‌రుగుత‌న్నాయ‌న్నారు.రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ అనే సంస్థను నెలకొల్పినా అది స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి మాత్రం లేదన్నారు. మాకీ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకుని ఆ మరుసటి రోజే లండన్‌ కంపెనీతో ఒప్పందాలు చేసుకోవడం లోపాయికారి ఒప్పందమేనన్నారు. ఈవిధంగా ఎందుకు చేశారో అర్థం కావ‌డంలేద‌న్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణ డిజైన్ల కోసం సినిమా దర్శకుడు రాజమౌళిని కూడా ఏపీ ప్రభుత్వం సంప్రదించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని మాకీ సంస్థ చైర్మన్ తన ఆర్టికల్‌లో ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠాలుగా భావిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట మసకబారే అవకాశం ఉందని పుమిహికో మాకి అభిప్రాయపడ్డారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఆక‌ర్శ‌నీయంగా రాజధానిని నిర్మిస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు ఏంచెప్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక విదేశాల‌కు పెట్టుబ‌డుల‌కోసం ఏముఖం పెట్టుకొని వెల్తారో చూడాలి. ఈ ఆర్టిక‌ల్ ఏపీ క‌త్త‌రాజ‌ధాని నిర్మానంపై ప్ర‌తికూల ప్ర‌బావం చూసె అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మ‌రి ఈ అంశంపై బాబు ఆయ‌న బ్యాచ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ఎన్నికలకు… సీతాదేవికి లింకేంది బాబు…!
  2. ఏరాయి అయితేనే ప‌ల్లు ఉడ‌గొట్టుకొనేదానికి
  3. జ‌గ‌న్‌పై సీబీఐ కేసుల‌న్నీ డొల్లే అని టీడీపీ లో చర్చ.
  4. లోకేష్ వచ్చాక టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తే షాక్ అవుతారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -