Wednesday, May 15, 2024
- Advertisement -

జ‌య‌ ఆస్తులు ఎవరికి చెందుతాయి?

- Advertisement -
jayalalitha have shocking accets noe who is owner of it

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత ఆక‌స్మిక మ‌ర‌ణం అనేక ప్ర‌శ్న‌ల‌కు జవాబు లేకుండా చేసేసింది. జ‌య‌ల‌లిత ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆమె వార‌సురాలు ఎవ‌రు ? అనే సందేహాలు ఒక వైపు ఉండగా.. మరో వైపు కోట్ల‌లో ఉన్న ఆమె ఆస్తులకు వారసులు ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు కరెక్ట్ అయిన జవాబు లేదు.

జ‌య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కోట్ల‌లోనే ఆస్తులు కూడ‌బెట్టార‌న్న టాక్ ఉంది. జ‌య‌కు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల‌తో పాటు ముఖ్య ప‌ట్ట‌ణాల్లోను లెక్క‌కు మిక్కిలిగా ఆస్తులు ఉన్నాయి. ఇళ్లు, స్థ‌లాలు, ఫాంహౌస్‌లు, తోట‌లు, పొలాల‌కు కూడా లెక్క‌లేద‌నే స‌మాచారం. ఉంది. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, తిరువ‌నంత‌పురం, పుదుచ్చేరి, ఢిల్లీ ప్రాంతాల్లో వంద‌ల ఎక‌రాల్లో స్థ‌లాలు, బంగ‌ళాలు ఉన్నాయి. ఆమెకు 30 ఎక‌రాల ఫామ్ హౌస్ హైద‌రాబాద్‌లో ఉంది.  అక్కడ త‌మిళ‌నాడుకు చెందిన వారు ఉంటారు.

ఇక ఇప్పుడు జ‌య ఆక‌స్మిక మృతితో వీటిని ఎవ‌రు పంచుకుంటారు ? అన్న ప్ర‌శ్న‌కు స‌రైన ఆన్సర్ లేదు. ఆమె అవివాహితురాలు, ఆమె సోద‌రుడి పిల్ల‌ల‌ను ఆమె ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. త‌ర్వాత పెంపుడు కొడుక‌ను దూరం పెట్టారు. త‌న ఆస్తుల‌ను త‌న త‌ర్వాత ఎవ‌రికి చెందాలో ఆమె వీలునామా రాయ‌లేదు. ఇప్పుడు వాటి విలువ కోట్ల‌లో ఉందని టాక్. వాటిని పెంపుడు కొడుకుకి ఇస్తారా ..? అలా కానిప‌క్షంలో అన్నాడీఎంకే పార్టీకి వాటిని అంకితం చేయాలి. అలా వీలుప‌డ‌క‌పోతే.. ప్ర‌భుత్వ‌మే ఆ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుని నిర్వ‌హించాల్సి ఉంటుంది. మ‌రి అమ్మ ఆస్తులు అంతిమంగా ఎవ‌రికి చెందుతాయో చూడాలి.

Related

  1. జ‌య‌ల‌లిత లైఫ్ సీక్రెట్స్ ఇవే!
  2. మోజు పడి.. స్టార్ హీరోతో జంప్‌ అయిన హీరోయిన్!
  3. విజ‌య‌శాంతికి పిల్ల‌లు ఎందుకు లేరంటే?
  4. వామ్మో.. మ‌ద్య‌పానం కంటే ముద్దు చాలా డేంజ‌ర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -