Friday, May 3, 2024
- Advertisement -

అమరావతి గ్రాఫిక్స్……. రాజమౌళి ఒక్కడే కాదా…. బాహుబలికి లాగే జక్కన్న కుటుంబం మొత్తం ఉన్నారా?

- Advertisement -

చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా, బాబు భజన బ్యాచ్ అంతా కూడా అమరావతిని ఎయిత్ వండర్ అని ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ మధ్య సినిమా హీరోయిన్స్ చేత కూడా మా గొప్పగా భజన చేయిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ కూడా అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకున్నది రెండు తాత్కాలిక భవనాలు మాత్రమే. ఆ పైన ఇతర నిర్మాణాలేవీ కూడా కనీసం శంకుస్థాపన చేసుకున్నది కూడా లేదు. అయినప్పటికీ బాబు అండ్ కోకు మాత్రం అమరావతి అద్భుతంగా కనిపిస్తోంది. ఇక పెయిడ్ ఆర్టిస్ట్‌లు అమరావతి గురించి మా గొప్పగా చెప్పేస్తున్నారు. గ్రీన్ సిటీ అమరావతి అని చెప్తున్న మాటలు అయితే మరీ కామెడీగా ఉన్నాయి. గుంటూరు-విజయవాడలో ఎండలు ఎలా ఉంటాయో తెలిసినవాళ్ళకు మాత్రం ఈ ప్రచారం నవ్వు తెప్పిస్తోంది. ఆ విషయం పక్కనపెడితే మొదటి నుంచీ కూడా ఈ అమరావతి నిర్మాణం మొత్తం తన ఇంటి వ్యవహారం అన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు. ఆ మధ్య ఒక కార్యక్రమంలో మొత్తం కుటంబాన్నే ఇన్వాల్వ్ చేశాడు చంద్రబాబు. ఇక ఇప్పుడు తాజాగా మరో కుటుంబం కూడా అమరావతి నిర్మాణంలో పాలు పంచుకుంటోందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

సినిమా డైరెక్టర్ రాజమౌళిని అమరావతి నిర్మాణ వ్యవహారాల్లో భాగస్వామిని చేసేశాడు చంద్రబాబు. ఇంటర్‌మీడియెట్ చదువుకున్న రాజమౌళి అమరావతి డిజైన్స్ ఎలా ఫైనల్ చేస్తాడు? బాహుబలి సినిమా సెట్టింగ్స్ అన్నీ కూడా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్‌ చేసిన వర్క్ కదా….అని విమర్శించిన వాళ్ళకు అమరావతి నిర్మాణంలో ఎవరి సలహాలైనా తీసుకుంటా అని దబాయింపు సమాధానం ఇచ్చాడు చంద్రబాబు. అంటే తనకు నచ్చిన అందరినీ, తన వాళ్ళను భాగస్వాములను చేస్తానని చెప్పకనే చెప్పాడు. అయితే ఇప్పుడు రాజమౌళి కొడుకు కూడా అమరావతి నిర్మాణం గురించి చంద్రబాబుతో చర్చిస్తూ ఉన్న ఫొటో బయటకు వచ్చింది. అమరావతి నిర్మాణంలో రాజమౌళి ఒక్కడే భాగస్వామి కాదా? బాహుబలి సినిమాకు పనిచేసినట్టుగా రాజమౌళి కుటుంబం మొత్తం నిర్మాణంలో పాల్పంచుకుంటోందా అన్న అనుమానాలు అందుకే వస్తున్నాయి. ఈ విషయం గురించి రాజమౌళి కానీ, చంద్రబాబు నుంచీ కానీ ఎలాంటి స్పష్టతా రాలేదు. మరోవైప తన వ్యక్తిగత పబ్లిసిటీ విషయంలో మరీ ముఖ్యంగా వీడియోలు, గ్రాఫిక్స్‌తో తన గురించి, తన పాలన గురించి గొప్పగా ప్రచారం జరగడం లేదని బాబు ఫీలవుతున్నాడు. అందుకే ఆ మధ్య బోయపాటితో భారీగా ప్లాన్ చేశాడు. అది కాస్తా బెడిసికొట్టి ముఫ్ఫై మంది పుష్కర యాత్రీకుల ప్రాణాలు తీసింది అన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు వచ్చిన బ్యాడ్‌నేం పుణ్యమాని బోయపాటి కాస్త వెనక్కి తగ్గాడు. అందుకే ఇప్పుడు రాజమౌళి కొడుకుతో వీడియోలు, గ్రాఫిక్స్ ప్రచారం గురించి చర్చిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ కాంట్రాక్ట్ ఎన్ని కొట్లో ఉంటుందో……సోషల్ మీడియాతో సహా ఎల్లో మీడియాలో ఈ ప్రచారం ఏ స్థాయిలో హోరెత్తుతుందో చూడాలి మరి. ఇలాంటి తన ప్రచారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం అన్న విషయం చంద్రబాబుకు అస్సలు గుర్తురాదు. అసలే అప్పుల్లో, బడ్జెట్ లోటులో ఉన్న రాష్ట్ర బడ్జెట్‌పై ఈ బాబు ప్రచార భారం కూడా అవసరమా అని అడిగారో…….అద్భుత అమరావతికి మీరు వ్యతిరేకులయిపోయినట్టే…….లోకేష్ బాబు వచ్చి మీ ఆధార్ కార్డ్ చూపించమని నిలదీసే ప్రమాదం కూడా ఉంది సుమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -