Saturday, May 11, 2024
- Advertisement -

కథువా కేసులో దోషులు ఎవ‌రో నిగ్గు తేల్చిన డీఎన్ఏ రిపోర్ట్…

- Advertisement -

నిర్భయ ఘటన తరువాత దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా హత్యాచార ఘటనలో ల్యాబ్ పరీక్షల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘ‌ట‌న ప్ర‌పంచాన్ని క‌దిలించింది. దేశ వ్యాప్తంగా ఇత‌ర దేశాల్లో కథువా హత్యాచార ఘటనను తీవ్రంగా వ్య‌తిరేకించ‌ని సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో నిందితులను తేల్చేందుకు ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ 14 పరీక్షలను నిర్వహించింది. వెజైనల్ స్వాబ్స్, హెయిర్ స్ట్రాండ్స్, నలుగురు నిందితుల బ్లడ్ శ్యాంపిళ్లతో పాటు మృతురాలి విస్రా, బాలిక ఫ్రాక్, సల్వార్, అక్కడున్న మట్టి, రక్తపు మరకలను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు.

శ్యాంపిళ్లను పరీక్షించిన తరువాత నిందితులే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ల్యాబ్ తేల్చింది. యోని ద్రవాలపై నిర్వహించిన పరీక్షలో డీఎన్ఏ శాంపిళ్లు కూడా మ్యాచ్ అయినట్టు రిపోర్ట్ వెల్లడించింది. దీంతో చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్‌ అధికారులు అన్నారు.

కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్‌ఏతో సరితూగాయని ఫోనెన్సిక్‌ నివేదికలో తేలింది.

దీంతో నార్కో టెస్టుకు సిద్ధమంటూ నిందితులు చేసిన వ్యాఖ్యలు కేసును పక్కదారి పట్టించేందుకేనని నిర్ధారణ అయింది. ఈ నివేదికను జమ్మూకశ్మీర్ క్రైం పోలీసులకు అందజేసినట్లు ల్యాబ్ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -