Saturday, April 20, 2024
- Advertisement -

వాట్స‌ప్ ఫేక్ కాల్స్‌తో జ‌ర జాగ్ర‌త్త‌….!

- Advertisement -

ఇది డిజిటల్ యుగం… ఎలాంటి లావాదేవీలైనా స్మార్ట్‌ఫోన్‌పై జరిగిపోతుంటాయి. కాలు కదపకుండా కూర్చున్నచోటి నుంచే ట్రాన్సాక్షన్స్ చేయడం మంచి సదుపాయమే. కానీ ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో… అక్కడ ప్రమాదం కూడా పొంచే ఉంటుంది. మీరు కాలు కదపకుండా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారో… సైబర్ నేరగాళ్లు కూడా కూర్చున్న చోటి నుంచే మీ అకౌంట్ ఖాళీ చేస్తుంటారు.

ఇలాంటి మోసాలు ప్ర‌తీరోజు ఎక్క‌డో ఒక చోటు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ మోసాలు చేసే ముఠాలు రూట్ మార్చాయి. ఫేక్ వాట్స‌ప్ లాట‌రీ కాల్స్‌తో అమాయ‌కుల‌ను మోసం చేసి ల‌క్ష‌ల్లో డ‌బ్బులు కొల్ల‌గ‌డుతున్నారు.

వాట్స‌ప్ కాల్ ద్వారా ఎలా మోసం చేస్తారో ఒక సారి చూద్దాం :

వాట్స‌ప్ నెంబ‌ర్(00923051864221) నుంచి మొద‌ట ఇమేజ్ వ‌స్తుంది. ఆ ఇమేజ్‌లో మీకు కేబీసీ లాట‌రీ త‌గిలింద‌ని ఉంటుంది. ఇమేజ్‌ను చూసిన వెంట‌నే ఒక వాట్స‌ప్ పోన్(00923051864221) కాల్ వ‌స్తుంది. కాల్ చేసిన వ్య‌క్తి మీకు కేబీసీ ల‌క్కీ డ్రాలో మీ మొబైల్ నెంబ‌ర్‌కు రూ.25 ల‌క్ష‌ల లాట‌రీ త‌గిలింద‌ని న‌మ్మ‌బ‌ల‌కుతాడు. నిర్ధారించుకోడానికి పీఎన్‌బీ మేనేజ‌ర్ రాణాప్ర‌తాప్ సింగ్‌తో మాట్లాడాల్సి ఉంటుందంటూ సెల‌విస్తారు. కాల్ కట్ట్ చేసిన వెంటనే మీకు ఓ ఇమేజ్ వ‌స్తుంది… అందులో పీఎన్‌బీ మేనేజ‌ర్ రాణాప్ర‌తాప్ సింగ్‌ (0092301 7784766) పోన్ నెంబ‌ర్ ఉంటుంది అతనితో మీరు వాట్స‌ప్ పోన్(0092301 7784766) కాల్ చేసి మాట్లాడాండి.. లాట‌రీ డ‌బ్బులు మీ అకౌంట్‌కు జ‌మ అవుతాయ‌ని చెప్పి కాల్ క‌ట్ చేస్తారు. అయితే అ పోన్ నంబర్ ట్రుకాలర్ లో KBC అని ఉంటుంది.

ఒక వేల ఆశ‌ప‌డి ఆనెంబ‌ర్‌కు వాట్స‌ప్ పోన్ చేస్తే ఒక వ్య‌క్తి నేను పీఎన్‌బీ బ్యాంక్ మేనేజ‌ర్ రాణాప్ర‌తాప్ సింగ్‌ను మాట్లాడుత‌న్నాను… మీ లాట‌రీ నెంబ‌ర్‌ను చెప్ప‌వ‌ల‌సిందిగా కోరుతారు. అయితే ఇమేజ్‌లో ఉన్న లాట‌రీ నెంబ‌ర్ చెప్పిన వెంట‌నే ..లాట‌రీ డ‌బ్బులు మీ అకౌంట్‌కు బ‌దిలీ చేయ‌మంటారా లేకా డైరెక్ట్ గా తీసుకుంటార‌ని అడుగుతారు. ఇక్క‌డే అస‌లు క‌థ మొవ‌ద‌ల‌వుతుంది….

అస‌లు విష‌యానికి వ‌స్తే లాట‌రీ డబ్బులును తీసుకొనేందుకు ముంబై రావాల‌సిందిగా కోరుతారు న‌మ్మ‌కం క‌లిగేలాగా… ఇంక న‌మ్మ‌కం కలిగించేందుకు.. లేక పోతే మీ జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ నంబ‌ర్‌ని వాట్స‌ప్‌లో మెస్సేజ్ చేయమంటారు. అకౌంట్ నంబ‌ర్‌ని మెస్సేజ్ చేసిన తరువాత వాట్స‌ప్ కాల్ చేయమంటారు. మీకు నమ్మకం కలిగి అకౌంట్ నంబ‌ర్‌ని వాట్స‌ప్‌ మెస్సేజ్ చేసి వాట్స‌ప్ కాల్ చేస్తే… మీ అకౌంట్ నంబ‌ర్‌ వచ్చింది.. ప్రాసెస్ చేసాను రేపు ఉదయం 8.30 వాట్స‌ప్ కాల్ చేయండి.

ఉదయం తిరిగి వాట్స‌ప్ కాల్ చేస్తే… మీఅకౌంట్ నెంబ‌ర్‌ని ఢిల్లీ, ముంబై, కోలకతా ల‌లో ఉన్న పీఎన్‌బీ అన్ని బ్రాంచ్‌ల‌కు పంపించాము. ప్రాసెస్ న‌డుస్తోంది… 10 నిమిషాల్లో తిరిగి వాట్స‌ప్ కాల్ చేయండి. 10 నిమిషాల తరువాత వాట్స‌ప్ కాల్ చేస్తానే షాకింగ్ విష‌యం చెప్తాడు… అకౌంట్‌లో డ‌బ్బు జ‌మ అయ్యేదానికి సమ‌యం ప‌డుతుంది.. దీని కొర‌కు ఒక ప‌ని చేయ‌వ‌లసి ఉంటుంది. ఇప్పుడే మీకు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

మీరు వెంట‌నే దగ్గరలో ఉన్న SBI బ్యాంక్ దగ్గరికి వెళ్లి వాట్స‌ప్ కాల్ చేయండి.. ఇప్పుడు కూడా మీరు నమ్మినట్లైతే… తిరికి వాట్స‌ప్ కాల్ చేస్తే… మీ లాట‌రీ రూ.25 ల‌క్ష‌ల రూపాయిలు ప్రాసెస్ మొత్తం అయింది.. ఈ ప్రాసెస్ కోసం రూ. 22500 రూపాయిలు ఖర్చు అయింది… అ అమౌంట్ మీరు మేము ఇచ్చిన గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయి యొక్క అకౌంట్ కు జ‌మ‌చేయండి. వెంట‌నే లాట‌రీ డ‌బ్బులు మీ కాతాలోకి వస్తాయి.. డ‌బ్బులు వేసేంత వ‌ర‌కు స‌తాయిస్తారు. మీరు డ‌బ్బులు వేశారో మునిగిన‌ట్లే.

గ‌మ‌నిక‌…
ముంబై నుంచి పోన్ చేసే వ్య‌క్తి యొక్క నెంబ‌ర్ ట్రుకాలర్ లో పాకిస్థాన్ నెంబ‌ర్ ఎందుకు అవుతుందో గ‌మ‌నించాలి. 

ఒక వేల రూ. 22500 రూపాయిలు జ‌మ చేస్తే మీ ప‌ని గోవిందా…గోవిందా… ఇలాంటి వాట్స‌ప్ ఫేక్ కాల్స్ తో జాగ్ర‌త్త‌. ఇది ఒక క‌ష్ట‌మ‌ర్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌న‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -