Thursday, March 28, 2024
- Advertisement -

మాట మీద కేసీఆర్.. ఆర్టీసీకి మరో గుడ్ న్యూస్

- Advertisement -

సీఎం కేసీఆర్ అన్న మాట నెరవేర్చాడు.. ఆర్టీసీ కార్మికులకు సంక్రాంతి వేళ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ సమ్మె కాలంలో బంద్ చేసిన కార్మికులకు వేతనాలను ఆ సమయంలో కేసీఆర్ సర్కారు ఇవ్వలేదు. కానీ సమ్మె విరమణ సమయంలో ఇస్తామని మాట ఇచ్చింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ ఉద్యోగులకు ఆ వేతనాలు చెల్లిస్తామని చెప్పి తీపి కబురునందించింది.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగింది. ఎంతకూ వెనక్కి తెగ్గలేదు. కేసీఆర్ కొరఢా ఝలిపించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను నిర్వీర్యం చేశారు.చివరకు సమ్మె విరమించి కార్మికులు కేసీఆర్ ను శరణు వేడారు. 30మంది వరకూ కార్మికులు చనిపోయారు. కేసీఆర్ కఠినంగా వ్యవహరించడం.. దేశవ్యాప్తంగా సమ్మెపై చర్చ కూడా జరిగింది. కార్మికులకు కేసీఆర్ జీతాలు కూడా చెల్లించకుండా ఉక్కుపాదం మోపారు.

అయితే సమ్మె విరమణ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మికుల సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.55రోజులు చేసిన సమ్మెకు తాజాగా సంక్రాంతికి నాలుగు రోజుల ముందు 11న ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను కూడా ఆర్టీసీ యాజమాన్యం చెల్లించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -