సరికొత్త ప్రయోగాత్మక మూవీగా రాబోతున్న “మడ్డీ” !

- Advertisement -

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ గా రియలిస్టిక్ యాక్షన్ రేసింగ్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన చిత్రం “మడ్డీ”. డాక్టర్ ప్రగభల్ దర్శకత్వం వహించగా.. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిటర్‌. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా కోసం రియల్ మడ్ రేసర్స్ పని చేశారు. ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు డాక్టర్ ప్రగభల్.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కించబోతున్నాడట.మోషన్ పోస్టర్ లోని విజువల్స్ ఎంతో గ్రాండ్ గా, రియలిస్టిక్ గా ఉండి చిత్రం పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రేక్షకులకు 4×4 వినూత్న సినిమా అనుభవాన్ని ఈ చిత్రం అందిస్తుందట..ఇక ఈ చిత్రాన్ని పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు.

- Advertisement -

తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల చేయబోతున్నారు. కాగా, యలిస్టిక్ విజువల్స్‌తో ఎంతో గ్రాండియర్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ 2 మిలయన్స్‌కి పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నారు.

శ్యామ్ సింగరాయ్.. డిఫెరంట్ లుక్‌లో నాచుర‌ల్ స్టార్ నాని

ఛాయ్ పెట్టిన వైసిపి మంత్రి.. ఎందుకా పరిస్థితి అంటే..!

మ‌హా శివరాత్రికి పవన్ సినిమా ఫస్ట్ లుక్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -