మ‌రో భూ కుంభ‌కోనంలో టీడీపీ ఎమ్మెల్యే….

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మ‌రో సారి భూ వివాదంలో ఇరుక్కున్నారు. విజయవాడలోని సుబ్బరాయనగర్ వెంచర్‌లో స్థలం ఇస్తామని డబ్బు తీసుకుని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తమను మోసం చేశారని నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆరోపించారు.

నందిగామకు చెందిన తనకు సుబ్బరాయనగర్‌లోని ఓ వెంచర్‌లో స్థలం ఇస్తామని చెప్పారని.. తాను రూ.35లక్షలు కూడా ఇచ్చినట్లు చెబుతున్నాడు. డబ్బు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. తనకు స్థలం మాత్రం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించాడు. దీంతో తాను పోలీసుల్ని ఆశ్రయించానన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమతో పాటూ ఆయన అనుచరులు మాగంటి బాబు, వాసు, వర్మలపై సీపీకి ఫిర్యాదు చేశాడు.

బోండా ఉమపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో బోండా ఉమ అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేయగా, సదరు ఎమ్మెల్యే మాత్రం అవి తప్పుడు ఆరోపణలని వివరణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -