Saturday, April 20, 2024
- Advertisement -

మద్యం షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు

- Advertisement -

అందరూ ఊహించినట్టే రేపటి నుంచి లాక్ డౌన్ ప్రకటించింది టీ సర్కార్. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో లాక్ డౌన్ అనివార్యం అని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఏర్పడిందిన టీ సర్కారె తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి నిచ్చింది. ఈ లాక్ డౌన్ 10 రోజుల పాటు కొనసాగనుంది.

కోర్టు అడిగిన మేరకు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ అనగానే మందుబాబులకు గుబులు పుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినేట్ పది రోజులు లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోగా.. వైన్స్ ముందు మందుబాబులు క్యూ పెరిగిపోయింది. హైదరాబాద్‌లో మందుబాబులు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మందు షాపుల ముందు క్యూలో నుంచున్నారు.

గత ఏడాది లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వేలకువేలు పెట్టి మందు కొనుక్కొనే పరిస్థితి రాగా ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడొద్దని మందుబాబులు ముందు జాగ్రత్తగా మద్యం షాపుల వద్ద క్యూ కట్టారు. ప్ర‌భుత్వం మ‌ద్యం షాపుల‌ను కూడా కిరాణ‌షాపుల్లాగే, ఉద‌యం 6గంట‌ల‌కే తెరిచేందుకు అనుమ‌తి ఇస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్..

ఆ కోరిక తీరకుండానే చనిపోయిన TNR.. చివరి వరకు అదే ధ్యాసలో?

మన్యంలో క‌రోనా కలకలం.. 10 మంది మావోయిస్టులు మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -