- Advertisement -

దేశంలో అవినీతి ప‌రులకు ఇక‌నుంచి నిద్ర‌లేని రాత్రులే…

- Advertisement -

భారతదేశ మొట్టమొదటి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్ నియ‌మితులు కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గిలతో కూడిన సెలక్షన్‌ కమిటీ జస్టిస్‌ ఘోష్‌ను ఎంపిక చేసింది. అయితే ఆయ‌న పేరును అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. లోక్‌పాల్‌లోని 8 మంది సభ్యులు, ఇతర అంశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చేవారం విడుదల కానుంది. దేశంలో లోక్‌పాల్ చట్టం తెచ్చిన ఐదేళ్ల తర్వాత కేంద్రం లోక్‌పాల్‌ను నియమిస్తుంది. లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు గడువు విధించడంతో కేంద్ర ప్రభుత్వం ఈమేరకు స్పందించింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని గత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ హామీయిచ్చిన సంగ‌తి తెలిసిందే. లోక్‌పాల్‌‌గా నియమితులైతే ఆయన నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు. లోక్‌పాల్‌కు ఫుల్ పవర్స్ ఉంటాయి. అవినీతి ఆరోపణలు వస్తే ప్రధానమంత్రితోపాటు మాజీ ప్రధానులను కూడా విచారించే అధికారం ఉంటుంది. కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విదేశాల నుంచి ఏడాదికి రూ.10లక్షల కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకునే వ్యక్తులు, సంస్థలను కూడా విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. సెంట్ర‌ల్ విజిలెన్స్ క‌మిటీతో క‌ల‌సి లోక్‌పాల్ ప‌నిచేయ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -