- Advertisement -

న్యూయార్క్ జైలులో మదురో..ట్రంప్ సంచలన ప్రకటన!

- Advertisement -

వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా బలగాలు కారాకాస్‌లో సంచలన ఆపరేషన్‌లో అరెస్టు చేసి, న్యూయార్క్‌లోని ఒక నిర్బంధ కేంద్రానికి తరలించాయి. అక్కడ ఆయనపై “నార్కో–టెర్రరిజం” ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడి ద్వారా దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై నియంత్రణ సాధించి, అక్కడి విశాలమైన చమురు వనరులను వినియోగించుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు.

63 ఏళ్ల మదురోను ఆయన భార్యతో కలిసి అరెస్టు చేశారు. అమెరికా ప్రభుత్వం ఆరోపణల ప్రకారం, మడురో ప్రభుత్వం మాదకద్రవ్యాల తయారీ, డ్రగ్ కార్టెల్స్‌కు ఆశ్రయం కల్పించడం, అమెరికాలోకి మత్తుపదార్థాల అక్రమ రవాణా చేయడం ద్వారా “అమెరికన్ల ప్రాణాలను నాశనం చేయాలనే” కుట్రలో భాగమైంది. న్యూయార్క్‌లో మదురోపై నాలుగు ప్రధాన అభియోగాలు ఉన్నాయి—నార్కో-టెర్రరిజం కుట్ర, కోకైన్ దిగుమతి కుట్ర, మెషిన్ గన్స్ మరియు విధ్వంసక ఆయుధాల కలిగి ఉండటం, వాటిని కలిగి ఉండేందుకు కుట్ర చేయడం. ఆయన సోమవారం మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టులో తొలిసారి హాజరుకానున్నారు. ఈ కేసుల్లో మడురో భార్య, కుమారుడు సహా మరో ముగ్గురు కూడా నిందితులుగా ఉన్నారు.

సరైన మార్పు జరిగే వరకు వెనిజులాను తాత్కాలికంగా అమెరికానే నడుపుతుంది అని చెప్పారు. వెనిజులా చమురు వనరులను ఇతర దేశాలకు విక్రయించేందుకు కూడా వినియోగిస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్ అమెరికా సార్వభౌమత్వాన్ని లేదా అమెరికన్ల ప్రాణాలను ముప్పులో పెట్టేవారికి హెచ్చరికగా నిలుస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, వెనిజులా సుప్రీంకోర్టు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది. దేశ పరిపాలన కొనసాగింపునకు, జాతీయ రక్షణ కోసం ఆమె బాధ్యతలు చేపడతారని కోర్టు పేర్కొంది. వెనిజులా ప్రభుత్వం ఈ సైనిక దాడిని తీవ్రంగా ఖండించింది. దేశ చమురు, ఖనిజ వనరులను దోచుకోవడమే లక్ష్యమని ఆరోపించింది. ఈ దాడిలో కారాకాస్ సహా పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్ దెబ్బతిన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -