- Advertisement -

మరోసారి లిమ్కా లోకి మేఘా ఇంజనీరింగ్‌

- Advertisement -

ల‌క్ష్యం ఒక సిద్ధాంతం, వేగం ఒక ఆయుధం, అంకిత భావం ఒక నినాదంతో వేగంగా లక్ష్యాన్ని ఛేదించి, జాతీయ స్థాయిలో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది “మేఘా ఇంజ‌నీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌”. నిర్దేశించిన గ‌డువుక‌న్నా ముందే సబ్ స్టేష‌న్‌ను నిర్మించ‌డం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకుంది.

దేశంలోనే అత్యంత వేగంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది ఎంఈఐఎల్‌. అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద 15 నుంచి 18 నెలల్లో పూర్తి కావాల్సిన 400 /200 కెవి సబ్‌ స్టేషన్‌ను ఏడు నెలల్లో ఎంఈఐఎల్‌ పూర్తిచేసింది. 2015 సెప్టెంబర్‌ 25న సబ్‌స్టేషన్‌ నిర్మణాన్ని మొద లుపెట్టి 2016 ఏప్రిల్‌ 26న ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. అదే రోజున పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ సబ్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. ఇంతకు ముందే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని గడువుకన్నా ముందే నిర్మించటం ద్వారా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్స్డ్‌లోకి ఎంఈఐఎల్‌ ఎక్కిన విషయం తెలిసిందే.

జాతీయ స్థాయిలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన న‌వ‌ర‌త్నాల్లో ఒక‌టైన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా (కేంధ్ర ప్ర‌భుత్వరంగ సంస్థ‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా, ఎన్పీకుంట (నంబుల పూల‌కుంట‌) వ‌ద్ద స‌బ్ స్టేష‌న్ నిర్మాణాన్ని క్లిష్ట‌మైన న‌మూనాలు, క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు, ఏమాత్రం అనుకూల ప‌రిస్థితులు లేని వ‌ర్షాలు కురుస్తున్న ఈ ప్రాంతంలో గ‌డువు క‌న్నా ముందే కేవ‌లం ఏడు నెల‌ల కాలంలోనే 400/220 కేవీ స‌బ్ స్టేష‌న్ దేశంలోనే అత్యంత వేగంగా “ఎంఈఐఎల్” ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. దేశంలోనే ఇదొక రికార్డ్‌. దీనికి గానూ ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్ నుంచి మెమెంటోతో పాటు ప్ర‌శంసా పత్రాన్ని అందుకోవ‌డం ద్వారా జాతీయ స్థాయిలో అరుదైన విష‌యంగా న‌మోదైంది. దీనితో పాటు పీజీసీఐఎల్ అందించే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన బెస్ట్ డెబ్యుటెంట్ అవార్డు ను “మేఘా ఇంజ‌నీరింగ్” ద‌క్కించుకుంది. నాణ్య‌తా ప్ర‌మాణాల ప్ర‌కారం ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్లు ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా త‌న వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పేర్కొంది.

ఎన్పీ కుంట వ‌ద్ద కొత్త‌గా నిర్మించిన అల్ట్రా మెగా సోలార్ ప‌వ‌ర్ పార్కు నుంచి 1500 మెగావాట్ల విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేసేందుకు ఉద్దేశించిన ఈ 400/220 కేవీ స‌బ్‌స్టేష‌న్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ చేప‌ట్టింది. ఈ ప్రాంతంలో విద్యుత్తు అవ‌స‌రాల‌ను, ఈ ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో ఉంచుకొని ఎంఈఐఎల్ వీలైనంత త్వ‌ర‌గా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు స‌మాయ‌త్త‌మైంది. 25 సెప్టెంబ‌ర్ 2015న ప్రాజెక్టు నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూమిని ఎంఈఐఎల్‌కు పీసీసీఐఎల్ అప్ప‌గించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్ 500 ఎంవీఏ, 400/220 కేవీ సామ‌ర్థ్యం క‌లిగిన మూడు ఆటో ట్రాన్స్ ఫార్మ‌ర్లు, 125 ఎంవీఏఆర్ ఒక బ‌స్ రియాక్ట‌ర్‌ను నిర్మించింది. 400 కేవీ 100 ఏవీఏఆర్ స్టేష‌న్ ఒకటి, 400 కేవీ బేస్‌లైన్లు రెండు, 400 కేవీ టైబేస్‌లు నాలుగు, 220కేవీ లైన్ బేస్‌లు నాలుగు, 220 కేవీ బ‌స్ క‌ప్‌లార్ బే ఒక‌టి, 220 ట్రాన్స్ ఫార్మ‌ర్ బ‌స్ క‌ప్‌లార్ బే ఒక‌టి, 220 కేవీ, 500 ఎంవీఏ, ఆటో ట్రాన్స్ ఫార్మ‌ర్ బేలు మూడు ఏర్పాటు చేసింది. వీటితో పాటు డ్రైన్‌లు, ర‌హ‌దారులు, క‌ల్వ‌ర్టులు, కంట్రోల్ రూమ్‌, బే క్యూస‌క్ క్యాంపు, ఫైర్ ఫైటింగ్ పంప్ హౌస్ మొద‌ల‌గు నిర్మాణాల‌ను పూర్తి చేసింది.

ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించ‌డం, సాంకేతిక నైపుణ్యం క‌లిగిన సిబ్బందిని నియమించ‌డం, ఏక‌కాలంలో భిన్న‌మైన ప‌నుల‌ను శ‌ర‌వేగంగా చేయ‌డంతో ఎన్పీ కుంట సోలార్ పార్కు వ‌ద్ద నిర్మించిన 400/220 కేవీ స‌బ్‌స్టేష‌న్‌ను కేవ‌లం ఏడు నెల‌ల రికార్డు స‌మ‌యంలో ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ఇది పున‌రుత్పాద‌క శ‌క్తిని గ్రిడ్‌కు అనుసంధానించ‌డంలో శ‌క్తివంత‌మైన ముంద‌డుగు అని పీజీసీఐఎల్ త‌న వెబ్ సైట్‌లో పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -