Wednesday, May 22, 2024
- Advertisement -

భార‌త్ మార్కెట్‌లోకి త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్న మోట‌రోలా..

- Advertisement -
Motorola Moto C, Moto C Plus to launch soonly in india

భార‌త్ మార్కెట్‌లోకి రోజుకొ కొత్త పీచ‌ర్స్‌తో స్మార్ట్ పోన్లు వ‌స్తున్నాయి.ప్ర‌ధానంగా షియోమి కంపెనీకి చెందిన రెడ్ మి సిరీష్ ఫోన్ల హ‌వా కొన‌సాగుతోంది.త్వ‌ర‌లోనే రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేస్తామని ప్ర‌క‌టించింది. అయితే దీన్ని త‌ల ద‌న్నే ఫీచ‌ర్స్‌తో మోట‌రోలా కొత్త ఫోన్ల‌ను రంగంలలోకి దింపేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

మోటో సీ, మోటో సీ ప్లస్ వేరియంట్ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
మోట‌రోలాను సొంతం చేసుక‌న్న లెనోవా ఫోన్ల‌ను లాంచ్ చేసె తేదీ ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికి జూన్ లో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, తాజాగా షియోమి లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ఏ కు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ నోగట్ తో రన్ అవుతాయని తెలుస్తోంది. రెడ్ మి 4ఏ రెండేళ్ల కిందటి ఆండ్రాయిడ్ మార్ష్ మాలోతోనే రన్ అవుతోంది. గోల్డ్, సిల్వర్, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుందని, 5 అంగుళాల డిస్ ప్లేతో ఇది మార్కెట్లోకి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మోటో సీ ఫోన్ కు 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉండగా.. మోటీ సీ ప్లస్ కు 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 8ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ షూటర్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో సీ ఫోన్ కలిగి ఉంటుందని నిపునుల వ‌ర్గాల టాక్.

Related

  1. సంస్థ‌నుంచి 1000 మంది ఉద్యోగుల తొల‌గింపు…
  2. రెడ్‌మి సిరీష్ నుంచి మ‌రో కొత్త‌పోన్‌
  3. అమెరికాలో తొలిసారిగా 800 బిలియ‌న్ డాల‌ర్ల క్యాపిట‌లైజేష‌న్ మార్కును దాటిన యాపిల్‌
  4. టూవీల‌ర్ అమ్మ‌కాల్లో.. భార‌త్ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -