Saturday, April 20, 2024
- Advertisement -

ఇండస్ట్రీలో మరో విషాదం.. సంగీత దర్శకులు కన్నుమూత!

- Advertisement -

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు  ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి (72)  గుండెపోటు కారణంగా  చెన్నైలో చివరి శ్వాస విడిచారు. సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. మన్ను ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు.

కొడైకెనాల్‌లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు. సలీం అహ్మద్ రచించిన 2011 చిత్రం ఆడమింటే మకాన్ అబూ, ఉత్తమ నేపథ్య స్కోర్‌తో సహా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకోవడమేకాదు ఆస్కార్‌కు కూడా నామినేట్‌ అయింది. 

సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన థామ‌స్  జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు.  భావం (2002), మార్గం (2003), సంచరం అండ్‌ ఒరిడామ్ (2004) అనే నాలుగు చిత్రాలకు  గాను ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను కూడా అందుకున్నారు.

టీడీపీకి మరో షాక్.. చింతమనేని అరెస్ట్!

మ్యాక్స్​వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!

ఐపీఎల్ 2021 మినీ వేలం : కొత్త రికార్డు సృష్టించిన క్రిస్‌ మోరిస్..‌ ఏకంగా రూ.16.25 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -