Saturday, April 20, 2024
- Advertisement -

అమెజాన్ కి కొత్త ఇబ్బంది.. మొత్తం నాశనం చేశారు..!

- Advertisement -

ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ గోదాములపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్​ఎస్​) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ముంబయిలోని అంధేరి శివారు, పుణెలోని కొంద్వాలలో ఈ ఘటనలు జరిగాయి. అమెజాన్​ పోస్టర్లు, వెబ్​సైట్​, యాప్​లోని నావిగేషన్​ వ్యవస్థకు మరాఠీ భాషను వినియోగించకపోవడంపై కొంతకాలంగా ఎంఎన్​ఎస్​ అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో మరాఠీ నో అమెజాన్’​ అంటూ నినదిస్తూ ఆ కంపెనీ గిడ్డంగులపై కార్యకర్తలు విరుచుకుపడ్డారు.

అంధేరిలోని గిడ్డంగిలో ఎల్​ఈడీ టీవీ, ల్యాప్​టాప్​లు తదితరాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. సకినాక పోలీస్​స్టేషన్​లో 8 మందిపై కేసు నమోదైంది. పుణె ఘటనకు సంబంధించి 10 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్​ఐఆర్​ దాఖలైంది. తమ సంస్థ కార్యకలాపాలకు ఎంఎన్​ఎస్​, దాని అనుబంధ కార్మిక సంఘం అవరోధాలు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ అమెజాన్​ కంపెనీ కొద్దిరోజుల క్రితం దిండోషి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జనవరి 5న కోర్టులో హాజరుకావాలని ఎంఎన్​ఎస్​ అధ్యక్షుడు రాజ్​ఠాకరేకు నోటీసు జారీ అయిన నేపథ్యంలో దాడి ఘటన చోటుచేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -