Tuesday, April 23, 2024
- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించిన పవన్

- Advertisement -

నేతలు మండేలా ను ఆదర్శంగా తీసుకోవాలి:  పవన్ కళ్యాణ్ 

గత ఇరవై రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్న ఓటుకు నోటు కేసుపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.

నాయకులు పగలు, పంతాలకు పోతే మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు నష్టపోతారని అధికారంలో ఉన్నవారు ఈ విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. రాజకీయాలంటే పగలు, ప్రతీకారాలు కాదని,  దేన్ని తెగేదాకా లాగొద్దని ఆయన టిట్టర్‌లో పేర్కొన్నారు.  అలా కానిపక్షంలో వాళ్లని గద్దెనెక్కించిన జనమే అవస్థలకు గురవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. 

ఆఫ్రికాలో నల్లజాతీయులను అణచివేతకు గురిచేసినా.. తెల్లజాతీయులతో నెల్సన్ మండేలా స్నేహ పూర్వకంగానే మెలిగారని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నేతలంతా నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకోవాలని హితవు చెప్పారు. 

అయితే పవన్ కళ్యాణ్ పరోక్షంగా మాత్రమే స్పందించారు. ఆయన ట్వీట్స్‌లో ఏ రాజకీయ నేత పేరు వాడకుండానే ఇద్దరికి వర్తించేలా ట్వీట్ చేయడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -