Sunday, May 12, 2024
- Advertisement -

దాణా కుంభ‌కోణం కేసులో లాలూనీ దోషిగా ప్ర‌క‌టించిన రాంచీ సీబీఐ కోర్టు….

- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన దాణా కుంభ‌కోణం కేసులో దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీహార్ మాజీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌తో స‌హా 15 మందిని కోర్టు దోషులుగా ప్ర‌క‌టించింది. మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చింది. దోషులకు జనవరి 3న శిక్షలు ఖరారు కానున్నాయి.

1990-97 మధ్య లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా దాణా కొనుగోళ్లలో రూ.900 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 1991 నుంచి 1994 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్ర‌మంగా రూ.89 లక్షల విత్‌డ్రా చేశారు. ఈ వ్యవహారంలో ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసులకు సంబంధించి 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 2013లో ఐదేళ్ల శిక్షతో ఎన్నికల్లో ఆయన అనర్హుడయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న బేయిల్‌పై ఉన్నారు.

ఈ దాణా కుంభకోణం కేసును రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. ఈ మేరకు ఆయనను దోషిగా నిర్థారిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -