- Advertisement -

రాష్ట్రాన్ని నిర్బంధించి సర్వే చేశారు: రేవంత్

- Advertisement -

సకల జనుల సర్వేపై తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందర్నీ నిర్బంధించి  సమగ్ర సర్వే చేశారని, సర్వే పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని 12 గంటల పాటు నిర్బంధించి ఈ సర్వే చేశారని ఆయన అన్నారు.

సర్వే రోజు బస్సులను బంద్ చేసి, బార్లను తెరిచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సర్వే కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సొంత గ్రామాలకు రప్పించారన్నారు. అయితే వలస వెళ్లిన చాలామంది సర్వేలో పాల్గొనలేకపోయారన్నారు. సమగ్ర సర్వే రోజు తాను ఇంట్లోనే ఉన్నానని, అయితే తమ ఇంటికి ఎవరూ రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -