కరోనాతో కేంద్ర మాజీ మంత్రి అజిత్‌ సిం‍గ్‌ కన్నుమూత!

- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ (82) క‌రోనాతో కన్నుమూశారు. కోవిడ్‌ బారిన ప‌డిన ఆయ‌న గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంత‌రం చికిత్స కోసం గురుగ్రామ్‌లోని మేదాంత‌ ఆసుపత్రిలో చేరారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ రావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ పాత్ర చిరస్మరణీయంగా నిలిచి పోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అజిత్ సింగ్ మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. అజిత్ సింగ్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతంలో తనతో పాటు  కేంద్ర మంత్రివర్గంలో  సేవలు అందించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ కోరిక విని షాక్ అయిన మెగాస్టార్?

చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -