Saturday, May 18, 2024
- Advertisement -

ఘ‌రానా మోస‌గాడి లీల‌లు అన్నీ ఇన్నీ కాద‌య్యా..

- Advertisement -
Romeo conman who cheated over 100 women on matrimonial sites nabbed

ఫేస్‌బుక్‌,వాట్స్ అప్ ఇత‌ర సోషియ‌ల మీడియా ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దూసుకుపోతోంది.ప్ర‌పంచ‌లో ఏమూల‌న ఎక్క‌డ జ‌రిగినా క్ష‌నాల్లో ప్ర‌జ‌ల ముందు ప్ర‌త్య‌క్షం అవుతోంది.సోషియ‌ల్‌మీడియా ద్వారా మంచి ఎక్క‌వ‌గా మోసాలు జ‌రుగుతున్నాయి.సోషియ‌ల్ ద్వారా వంద‌మందికి పైగా మోస‌పోయిన అమ్మాయిల సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

హాసన్ నగరానికి చెందిన సాదత్‌ఖాన్‌ అలియాస్‌ ప్రీతమ్‌కుమార్‌18 ఏళ్లకే రంగంలోకి దిగాడు. ఏ అమ్మాయికి ఎలాంటి ఉద్యోగం ఉన్న అబ్బాయి ఇష్టమో గుర్తించి తాను అలాంటి ఉద్యోగినని నమ్మించాడు.ఫేస్‌బుక్‌, వాట్సప్‌, మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్ల ద్వారా యువతులను పరిచయం చేసుకుని పెళ్లాడతానని నమ్మించి వారినుంచి అందినంత డబ్బు, నగలు దోచుకుంటున్న ఘరానా వంచకుడు ఇప్పుడు క‌ట‌క‌టాలు లెక్క‌స్తున్నాడు.

{loadmodule mod_custom,GA1}

హాసన్‌లో ఐటిఐ వరకు చదివి ఆటోడ్రైవర్‌ అయ్యాడు. మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఇంకేముంది అస‌లు ప‌ని మొద‌లు పెట్టాడు.ఫేస్‌బుక్, మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో ర‌క‌ర‌కాల పేర్ల‌తో ప్రోఫైల్‌ను ఉంచాడు.అంతే సాప్ట్‌వేర్‌ ఇంజనీర్, ప్రభుత్వ అధికారి, ప్రైవేటు కంపెనీల సీఈవోనంటూ సూటుబూటులో ఫోటోలు పెట్టి యువతులను, మహిళలను ఆకర్షించడం ఆరంభించాడు.
గ‌త ప‌దిసంవ‌త్సరాల్లో వందమంది అమ్మాయిలకు వలేశాడు. అతని వలలో చిక్కిన అమ్మాయిలలో ఎక్కువ మందిని శారీరకంగానూ లోబరుచుకున్నాడు. మొదట వాళ్లతో విలాసాలకు బాగా ఖర్చుపెట్టేవాడు. ఆ తరువాత హఠాత్తుగా డబ్బు అవసర పడిందని వాళ్ల దగ్గరినుంచి పెద్దమొత్తంలో డబ్బు, లేదా బంగారం తీసుకునేవాడు.
ప్రియుడు మోసం చేశాడని తెలిసినా నోరు మెదపలేని పరిస్థితి. పోలీస్‌స్టేషన్‌ గడప ఎక్కితే తమ పరువును పోలీసులు బజారుకెక్కిస్తారన్న భయం. అందుకే నష్టపోయిన అమ్మాయిలంతా లోలోపల కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయారు. కొంత‌మంది ధైర్యం చేసి పోలీసుల‌కు పిర్యాదు చేశారు.

{loadmodule mod_custom,GA2}

బెంగళూరు ఎలహంక ప్రాంతానికి చెందిన ఒకావిడ ఇతనిమీద రేప్‌ కేసు పెట్టింది. దాంతో పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది.అతని వల్ల జరిగిన నష్టానికితోడు ఇప్పుడు విచారణ పేరుతో పోలీసులు తమ పరువు పోతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు.ఇతని బాధితుల సంఖ్య క్రమంగా పెరగవచ్చని పోలీసులు చెబుతున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}J3Vrnt2_w_U{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -