Friday, May 3, 2024
- Advertisement -

కేరళ ఫుల్ బాల్ జట్టుకు సహ పెట్టుబడిదారులు

- Advertisement -

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న ఐఎస్ఎల్ ఫ్రాంచేజ్ కేరళ బ్లాస్టర్స్ ఫుల్ బాల్ జట్టుకు సహ పెట్టుబడిదారులుగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కూడా జత కలిసారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా చేతులు కలిపారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వీరంతా కేరళలోని తిరువనంతపురం వెళ‌్లారు.

అక్కడ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కొంతభాగాన్ని ఈ కన్సార్షియం సొంతం చేసుకుంది. ఈ కన్సార్షియం యజమాని సచిన్ టెండూల్కర్ ఇక నుంచి సహ యజమానిగా కొనసాగుతాడు. ఈ సీజన్ లో ఫుట్ బాల్ కప్ గెలిచేందుకు ఎంతో కష్టపడుతున్నామని సచిన్ చెప్పారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ తాను రెండు చిత్రాల్లో గోల్ కీపర్ గాను, కోచ్ గానూ నటించానని అన్నారు.

ఇది తనకు కొత్త అనుభవమని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. కేరళలో మద్యపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి సచిన్ టెండూల్కర్ పేరును వాడుకుంటామని కేరళ ప్రభుత్వం సచిన్ ను కోరింది. ఇందుకు సచిన్ అంగీకరించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -