ప్రశాంతంగ సాగర్, తిరుపతి ఉప ఎన్నికల పోలీంగ్ ఆరంభం!

- Advertisement -

నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు ఉదయాన్నే మొదలైంది. ఓటర్లు చురుగ్గా పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందనే భయంతో..ముందే వచ్చి ఓటేసి వెళ్తున్నారు. నాగార్జునసాగర్ జూనియర్ కాలేజీలో ఏజెంట్ రాకపోవడంతో పోలింగ్ నిలిపేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

తర్వాత పోలింగ్ ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి.. ఇబ్రహీంపేటలోని MPUPS స్కూళ్లో ఓటేశారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, బీజేపీ నుంచి డాక్టర్ రవి నాయక్ మధ్య ప్రధాన పోటీలో ఉన్నారు.

- Advertisement -

ఇక తిరుపతి విషయానికి వస్తే.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ,జనసేన బలపరుస్తున్న రత్నప్రభ, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి ల మద్య పోటీ కొనసాగుతుంది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తొలిసారిగా ఈ ఎన్నికతో కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్లు పైబడినవారితో పాటు వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం 2470 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత..!

ఏపీలో లాక్‌డౌన్‌పై సీఎం జగన్ ఏమన్నారంటే..

నేటి పంచాంగం, శనివారం(17-04-2021)

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -