నేతలు మారితే.. ఓటర్లు మారరు గురూ !

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పడం కష్టం. ఇవాళ ఈపార్టీలో ఉన్న నేతలు రేపు మరో పార్టీ కండువా కప్పుకుంటారు. ” చచ్చే వరకు ఈ పార్టీతోనే ఉంటా ” అని చెప్పే నాయకులు.. తెల్లారితే మాట మార్చడంతో పాటు పార్టీ కూడా మారుస్తూ ఉంటారు. ఇది రాజకీయ నాయకుల సహజ స్వభావం. ఇదే విషయాన్ని ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ” ఎవరు ఏపార్టీలో శాశ్వతం కాదని ఆయన చెప్పుకొచ్చారు. సరే.. ఈ విషయాన్ని అలా ఉంచితే ! ” నేతలు పార్టీలు మారితే ఓటర్లు మారతారా ? ” అనేది ఇప్పుడు ప్రధానంగా అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో కీలక నేతలంతా కూడా పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున బిజెపీలోకి చేరికలు ఉంటాయని, వస్తారని కమలనాథులు ఇప్పటికే చాలా సార్లు చెప్పుకొస్తున్నారు. దీంతో కమలనాథులు రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోయేది తామే అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలు మారితే ఓటర్లు మారతారా ? అనే ప్రశ్నకు కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. పశ్చిమబెంగాల్ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పెద్ద ఎత్తున బీజేపీ లోకి చేరారు. దాంతో తృణమూల్ బలహీన పడిందని, అధికారంలోకి వచ్చేది తామేనని బీజేపీ నేతగా ఘనంగా ప్రకటించుకున్నారు.

తీరా ఎన్నికల ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 200 పైగా సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 70 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో నేతలు మారిన మమతాబెనర్జీ కి తిరుగులేదని రుజువైంది. ఇక ఆంద్ర ప్రదేశ్ విషయానికొస్తే 2019 ఎన్నికల ముందు వైసీపీ కి చెందిన 23 మంది ఎమ్మేల్యేలు టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ నాయకత్వం బాగోలేదని, అందువల్లే వైసీపీ నేతలు టీడీపీలో చేరారని.. గట్టిగా ప్రకటించి మళ్ళీ అధికరంలోకి వచ్చేది తామేనని గట్టిగా ప్రకటించారు. తీరా 2019 ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఏ స్థాయిలో కంగుతిందో అందరికీ తెలిసిందే. తిరిగి అధికారం చేపట్టబోయేది తామేనని ధీమా వ్యక్తం చేసిన టీడీపీకి 23 సిట్లే రాగా.. వైసీపీ మాత్రం 151 సీట్లతో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విధంగా గతాన్ని పరిశీలిస్తే.. నేతలు పార్టీలు మారినంతా మాత్రాన ఓటర్లు వారి అభిప్రాయాన్ని మార్చుకోరు అనేది స్పష్టంగా అర్థమౌతోంది. అందువల్ల ప్రజలను తక్కువగా అంచనా వేయకూడదని, ఓవరాల్ గా అన్నీ గమనించి తాము ఎన్నుకునే వ్యక్తికి ఓట్లు వేసి గెలిపిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

మోడీ ఆయుధంగా ఈడీ ?

డిల్లీలో బాబుకు అవమానం !

జగన్ సార్.. మీ జాతి “రత్నాలు” వీరేనా ?

Related Articles

Most Populer

Recent Posts