Friday, April 19, 2024
- Advertisement -

103వ భారతీయ విజ్ఞాన సదస్సు ఘనంగా జరిగాయి

- Advertisement -

కర్నాటకలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా  హాజరుకాగా. 10 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 30 మంది శాస్త్రవేత్తలకు మోడీ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు మోడీ పిలుపునిచ్చారు.

కర్ణాటకలోని మైసూర్‌లో 103వ భారతీయ విజ్ఞాన సదస్సు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ సదస్సును ప్రారంభించారు. అనంతరం టెక్నాలజీ విజన్‌-2035 డ్యాక్యుమెంట్‌ను ప్రధాని ఆవిష్కరించారు. 

సదస్సుకు హాజరైన దేశవిదేశాలకు చెందిన శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే విజ్ఞాన సదస్సు ప్రారంభించడం సంతోషంగా ఉందని మోడీ అన్నారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సాధికారత, ఉపాధి అవకాశాల మెరుగులో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చామన్నారు. ఆహారం, ఆరోగ్యం ప్రమాణాలు మెరుగుపర్చడంలో సఫలమయ్యామని వివరించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమని మోడీ తెలిపారు.

అంతేకాదు.. 2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో భారత్ ను ఆగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. శాస్త్ర, పరిశోధన రంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామని అన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో భాగస్వాములు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మోడీ విజ్ఞప్తి చేశారు. అనంతరం 30 మంది శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ పురస్కారాలను అందజేశారు.

ఆ తర్వాత కర్ణాటకలోని తుమకూరులో హెలికాప్టర్‌ తయారీ కర్మాగారానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. త్వరలో ప్రపంచ యవనికపై తుమకూరు జిల్లా తనదైన ముద్రవేయబోతోందని.. ఇతర దేశాలతో తీసిపోని విధంగా భారత్‌ అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవాలని మోడీ ఆకాంక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -