Friday, May 10, 2024
- Advertisement -

బ‌హిరంగ స‌భ ..లేకా బ‌ల ప్ర‌ద‌ర్శ‌న స‌భా……?

- Advertisement -
Secret Behind KCR holding a public meeting at Warangal..?

తెలంగాణాసీఎం కేసీఆర్ లో భ‌యం మొద‌ల‌య్యిందా…? ప‌్ర‌జ‌ల‌లో ఉన్న అభిమానం త‌గ్గుముఖం ప‌డుతోందా…? ప్ర‌తి ప‌క్షాలు బ‌లాన్ని పెంచుకుంటున్నాయా..? ప్ర‌స్తుతం ఎలాంటి ఎన్నిక‌లులేవు మ‌రి ఎందుకు బ‌హిరంగ‌స‌భా…?మ‌ంద‌స్తు ఎన్నిక‌ల‌లో భాగ‌మేనా ఈ బ‌ల ప్ర‌ద‌ర్శ‌నా….? నిరుద్యోగులు , యువ‌త‌లో కేసీఆర్ మీ వ్య‌తిరేక‌త పెరుగుతోంతా..? కోదండ‌రామ్ చేస్తున్న ప్ర‌జాఉద్యమాలు గుండెల్లో గుబులు రేపుతున్నాయి..? ప‌వ‌ణ్ క‌ళ్యాన్‌,గ‌ద్ద‌ర్ భ‌యం ప‌ట్ట‌కుందా..? ర‌న‌మాఫీ విష‌యంలో రైతులు సంతృప్తిగాలేరా..? కోదండ‌రాం ప‌రిస్తితులు చూస్తుంటే అలానే క‌నిపిస్తున్నాయి..దానికి నిద‌ర్శ‌న‌మే ఈస‌భ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణా కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేసి ..ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడి తెలంగాణ‌ను సాధించిన బాహుబ‌లి. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ద‌ళితున్ని సీఎం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ త‌ర్వాత ప‌రిస్తితుల దృష్యా సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎం అయిన వెంట‌నే ప‌రిపాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌వేశారు.రైతుల‌కు రుణ‌మాపీ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు.పేద‌ల‌కు డ‌బుల్‌బెడ్‌రూం ఇల్లు ప‌థ‌కం ప్ర‌క‌టించారు.ఏకంగా రైత‌లుకు ఎరువులు ప్రీగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.ప్ర‌జ‌ల‌లో టీఆర్ ఎస్‌పార్టీ,కేసీఆర్‌మీద అభిమానం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. మ‌రి ఎందుకు ఎప్పుడూ నిర్వ‌హించ‌ని రీతిలో వ‌రంగ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నార‌నేదానిపై ర‌క‌ర‌కాలు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని కెసిఆర్ ఏర్పాటు చేసి ఇప్పటికి 16 ఏళ్ళు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇది పార్టీకి మూడో వార్షికోత్సవం.క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈస‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు.ఇది బ‌హిరంగ స‌భాలేకా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌స‌భా అనే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.గ‌డిచిన రెండేళ్ల‌లో ఈ ఆర్భాటంగా పార్టీ ఆవిర్భావ దినోత్స స‌భ‌లను ఏర్పాటు చేయ‌లేదు.మ‌రి ఇప్పుడే ఎందుకు నిర్వ‌హిస్తున్నార‌నీ అనేక అన‌నుమానాలు త‌లెత్తుతున్నాయి, ప్ర‌స్తుతానికి ఎలాంటి ఎన్నిక‌లులేవు. ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి మెజారిటీ రాష్ట్రాలు సిధ్దంగా లేవు. 2019 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే, ఎన్నికలకి ఇంకా రెండేళ్ళు సమయం ఉంది. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా, లేదా దేశమంతా ఒకే సారి ఎన్నికలు జరపాలనే మోది ప్రయత్నం ఫలించినా కూడా 2018 లో కానీ ఎన్నికలు రావు. మరి ఏ ప్రయోజనమూ లేకుండా ఇప్పుడెందుకు ఇంత భారీ బ‌హిరంగ సభ పెడుతున్నారు .. దీని వెనుకాల కెసిఆర్ వ్యూహంతో పాటు… ప్ర‌జ‌ల్లో పార్టీపై ఏమ‌న్న వ్య‌తిరేక‌త పెరిగిందా పార్టీ ప‌రిస్తితి ఏంట‌నే వాటికి ఈస‌భ‌నే స‌మాధానాల వ‌స్తాయ‌ని కేసీఆర్ భావిస్తున్నారు…
ప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల్లో కెసిఆర్ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతోంది. .రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు అవుతున్నా, అరకొర రుణమాఫీ తప్ప ఏ ఒక్క పెద్ద హామీని కెసిఆర్ నేరవేర్చలేకపోవడం తో ప్రజలలో అసంతృప్తి మొదలవుతోంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష ఉద్యోగాలు ఈ రెండు హామీలు మాటలకే పరిమితం అయ్యాయి.వీటికి తోడు ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూపంపినీ అనీ ఆర్భాటంగా ప్ర‌క‌టించారు.కాని కొంత మందికి మాత్ర‌మే ఇచ్చి ఆ త‌ర్వాత చేతులు దులుపుకున్నారు.
ఇప్ప‌టికే తెలంగాణా ఉద్య‌మ‌స‌యంలో కోదండ‌రాం పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కోదండ‌రామ్‌ను దూరంగా పెట్టారు ..క‌నీసం అపాయంట్ మెంట్‌కూడా ఇవ్వ‌లేదు. దీంతో కోదండ‌రాం పార్టీకీ వ్య‌తిరేకంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌మీద పో్రాటం ప్రారంభించారు.ముఖ్యంగా ఉద్యోగాల‌ను క‌ల్పిస్తామ‌ని హామి ఇచ్చిన కేసీఆర్ వాటిని నెర‌వేర్చ‌డంతో విప‌ల‌మయ్యారు. ప్ర‌జ‌ల‌లో ఉన్న‌ అసంతృప్తిని రాజకీయంగా మరల్చుకొనేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ సిద్ధం అవుతున్నారు.ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌తో క‌ల‌సి ప్ర‌భుత్వంపై పోరాడుతున్నారు.
మరోపక్క తెలంగాణాలో టీఆర్ ఎస్ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీ భాజాపాన‌ని ఆపార్టీనేత‌లు ప‌లుసార్లు వ్యాఖ్య‌నించారు. అమిత్ షా కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణాలో పాగా వేయాల‌ని అమీత్‌షా పావులు క‌దుపుతున్నారు. ఇక‌ కాంగ్రెస్ కి పెద్దగా ఆశలు లేకపోయినా, హడావిడి అయితే చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, తెలంగాణ లో తానే పెద్ద లీడర్ ని అని, తనకి ప్రజాదరణ తగ్గలేదని, ప్రజలు తమ పట్ల సంతృప్తిగా ఉన్నారని కెసిఆర్ సంకేతాలు పంపేందుకే ఈబ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నార‌న్న సంకేతాలు వెలువ‌డ‌తున్నాయి.
వీటికితోడు మ‌రోవైపు ఉద్య‌మ నాయ‌కుడు గ‌ద్ద‌ర్ కూడా సొంతంగా పార్టీనీ ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ప‌వ‌ణ్ క‌ళ్యాన్ స్తాపించిన జ‌న‌సేన‌కూడా తెలంగాణాలో ఒంట‌రిగా పోటీచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. క‌మ్యూనిస్ట్ భావాలు క‌లిగిఉన్న ప‌వ‌ణ్ గ‌ద్ద‌ర్‌తో క‌ల‌సి పోటీచేస్తార‌నే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. జ‌న‌సేన‌తోపాటు తెలంగాణాలో ఉన్న అన్ని వామ‌ప‌క్ష‌,ప్ర‌జాస్వామ్య‌పార్టీల‌ను ఒకే తాటిమీద‌ర‌కు తెచ్చేందుకు గ‌ద్ద‌ర్ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.వీటికితోడు ప‌ల్లెప‌ల్లెకు పార్ల‌మెంట్ ల‌నే నినాదంతో పాద‌యాత్ర ప్రారంభిస్తున్నాని ప్ర‌క‌టించారు.
ముఖ్యమంత్రి కాకముందు కూడా, కెసిఆర్, పార్టీలో తనకి పట్టు తగ్గుతోందని అనుమానం వచ్చినా, లేదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలన్నా అయితే ఉపఎన్నికలు లేదంటే బహిరంగ సభలు అనే అస్త్రాలని ప్రయోగించేవారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి జనంలోకి వెళ్ళడానికి కెసిఆర్ కి నమ్మకం చాలడం లేదు. ఒక 10 లక్షల మందితో వరంగల్ లో సభ జరిపితే చాలు, మళ్ళీ పార్టీ శ్రేణులకి ఊపు వస్తుంది. ప్ర‌తి ప‌క్షాల నోల్ల‌కు పుల్ స్టాప్ పెట్టిన‌ట్టుఅవుతుంద‌నే కేసీఆర్ సిద్ద‌మ‌య్యారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. లోక‌ల్ … నాన్‌లోక‌ల్ కేటీఆర్ పంచ్ అదిరింది
  2. ముంద‌స్తు ఎన్నిక‌ల‌ని  మ‌రోసారి చేతులు కాల్చుకోవాలా బాబు…..
  3. నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌..ఉత్కంఠ‌కు తెర‌ప‌డేదెప్పుడు….?
  4. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -