Saturday, May 4, 2024
- Advertisement -

జగన్ కోసం మరో స్టిక్ట్ ఆఫీసర్…

- Advertisement -

ఏపీ రవాణా శాఖ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును జగన్ ప్రభుత్వం బుధవారం నియమించింది. విజయవాడలోని ఆర్టీసీ భవన్ లోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సీతారామాంజనేయులు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. బీఎస్ఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఈయన ఉమ్మడి ఏపీలో ఎస్పీగా, కమిషన్ గా సేవలందించారు. ఖమ్మం, గుంటూరు, కర్నూలు, జిల్లాలకు ఎస్పీగా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గానూ సేవలందించారు. ఆ తర్వాత డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అక్కడ బీఎస్ఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇటీవలే తిరిగి ఏపీకి జగన్ కోరిక మేరకు వచ్చారు.

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో కొత్త‌గా ప్ర‌భుత్వం ఏర్పడింది. పాత వాసనలకు భిన్నంగా జగన్ ముందుకెళ్తున్నారు. అవినీతి రహిత, పారదర్శకత పాలనకు అడుగులు వేస్తున్నారు. అందుకే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఐఏఎస్, ఐపీఎస్ లు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఐపీఎస్ రామాంజనేయులును రాష్ట్ర సర్వీసుల్లోకి రావాలని కోరగానే ఆయన ఒప్పుకున్నారు. దీనికితోడు- వైఎస్ జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను రాష్ట్రంలో కీల‌క హోదాను అప్ప‌గించ‌డానికి నిర్ణయం తీసుకున్నారు. . ఈ క్ర‌మంలో రాష్ట్ర స‌ర్వీసుల్లో కొన‌సాగ‌డానికి వీలుగా త‌న‌ను రిలీవ్ చేయాల‌ని కోరుతూ కొద్దిరోజుల కింద‌టే రామాంజనేయులు కేంద్ర హోమ్ మంత్రిత్వ‌శాఖ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై ఆ శాఖ సానుకూలంగా స్పందించింది. ఆయ‌న‌ను రిలీవ్ చేసింది.

సీనియర్ ఐపీఎస్ సీతారామాంజ‌నేయులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి రిపోర్ట్ చేసిన‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ధృవీక‌రించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. కీలకమైన ఏపీ రవాణా శాఖ కమిషనర్ గా సీతారామాంజనేయులును జగన్ నియమించారు. ఏపీలో ఇప్పుడు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంది. ఆర్టీసీని ఇటీవలే ఏపీ ప్రభుత్వం టేకప్ చేసింది.. అటువంటి సంస్థ ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకుండా చేయడంతోపాటు ప్రజలకు నిత్య అవసరమైన ఆర్టీసీని గాడినపెట్టాలంటే సీనియర్ అధికారులు కావాలి. అందుకే కేంద్ర సర్వీసుల్లో ఉన్న పి. రామాంజనేయులు శక్తి సామర్థ్యాలను గుర్తించి జగన్ ఆయనను రాష్ట్రానికి రప్పించి ఏపీ రవాణాశాఖను జగన్ అప్పగించారు. ఇలా కళికితురాలైన అధికారులను తన కేబినెట్ లోకి తీసుకుంటూ ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -