Saturday, April 20, 2024
- Advertisement -

షాజ‌హ‌న్ తాజ్‌మ‌హ‌ల్‌ను మాకు రాసిచ్చారు

- Advertisement -
సుప్రీంకోర్టులో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సున్నీ వ‌క్ఫ్ బోర్డు వాద‌న‌
ప్రపంచంలోని 7 వింతల్లో ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ ఉంది. అయితే ఆ తాజ్‌మ‌హ‌ల్ తమది అంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొంది. తాజ్‌మ‌హ‌ల్ నిర్మించిన షాజహాన్ దానిని తమకు రాసిచ్చాడని మంగళవారం (ఏప్రిల్-10) సుప్రీంకోర్టుకి వ‌క్ఫ్‌బోర్డు తెలిపింది. అయితే వాద‌న‌లు విన్న కోర్టు తాజ్‌మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుందని షాజహాన్‌ చేసిన డిక్లరేషన్‌ కాకుండా మరేదైనా షాజహాన్ రాసిచ్చిన పత్రాలు ఉంటే కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ ఆదేశించింది.
వారం రోజులలోపు ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని సున్నీ వక్ఫ్ బోర్డుకు సూచించింది. తాజ్‌మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందినదంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశ్నించారు. ఇటువంటి కేసుల కారణంగా విలువైన కోర్టు సమయం వృథా అవుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
తన భార్య ముంతాజ్‌ గుర్తుగా షాజ‌హాన్ తాజ్‌మహల్‌ను నిర్మించారు. 1658లో షాజహాన్‌ మరణించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత  తాజ్‌మహల్‌తో పాటుగా దేశ సాంస్కృతికతను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ) ఆధీనంలోకి తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -