Tuesday, April 23, 2024
- Advertisement -

తాజ్​మహల్​ సందర్శన టికెట్ రేటు పెంచారు!

- Advertisement -

ప్రఖ్యాత కట్టడం తాజ్​మహల్​ సందర్శనకు టికెట్​ ధరను పెంచాలని నిర్ణయించింది ఆగ్రా అధికార యంత్రాంగం. స్వదేశీ పర్యటకులకు రూ. 30, విదేశీ పర్యటకులకు రూ.100 టికెట్​ ధరను పెంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల కరోనా నేపధ్యంలో తాజ్ మహల్ సందర్శన మూసివేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ మద్యనే సందర్శన మళ్లీ మొదలు పెట్టారు.

ఇంతకుముందు తాజ్​ మహల్​ను సందర్శించేందుకు స్వదేశీ పర్యటకులు రూ. 50, విదేశీ పర్యటకులు రూ. 1100 చెల్లించేవారు.తాజ్​మహల్​ డోమ్​ను ప్రత్యేకంగా సందర్శించించేవారికి రూ. 200 ఛార్జ్​ విధించనున్నట్లు ఆగ్రా అభివృద్ధి అథారిటీ పేర్కొంది.

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్​ ఇండియా(ఏఎస్​ఐ) కూడా ప్రధాన డోమ్​ను సందర్శించే పర్యటకుల నుంచి రూ. 200 టికెట్టు ధర వసూలు చేస్తుందని ఆగ్రా డివిజనల్ కమిషనర్ అమిత్ గుప్తా స్పష్టం చేశారు.పెంచిన టికెట్టు ధర ప్రకారం… మెయిన్ డోమ్​ను సందర్శించే స్వదేశీయులు రూ. 480, విదేశీ యాత్రికులు రూ. 1600 చెల్లించాల్సి ఉంది.

కరోనా ఉందని తెలిసి షూటింగ్ కి హాజరైన హీరోయిన్.. కేసు నమోదు!

‘జాతిరత్నాలు’ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -