Thursday, March 28, 2024
- Advertisement -

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

- Advertisement -

ప్రస్తుతం శ్రీలంకలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. కనీవినీ ఎరుగని రీతిలో ఆ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆహార సంక్షోభం యావత్ ప్రపంచ దేశాలను సైతం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే ప్రస్తుత శ్రీలంక పరిస్థితికి చేరువలో మరికొన్ని దేశాలు కూడా రాబోతున్నాయా ? అనే అవుననే వార్తలు కొన్ని సర్వేల ద్వారా వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, ఉక్రెయిన్, అర్జెంటినా, ఈజిప్ట్, నేపాల్, ఘనా వంటి దేశలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలపై ఋణ భారం అధికంగా ఉంది. దాంతో ఈ దేశాల నుంచి వచ్చే ఆధాయంలో 20 శాతం వాటా కేవలం రుణాల చెల్లింపులకే కేటాయించాల్సి వస్తోంది.

అంతే కాకుండా ఆ దేశాల జి‌డి‌పి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.. దాంతో ఆ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన పొరుగు దేశం అయిన పాకిస్తాన్ విషయానికొస్తే ఆ దేశంలో ఇప్పటికే తలెత్తిన సంక్షోభం కారణంగా విదేశీ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఆ దేశంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ నిల్వలు 9.8 శాతానికి పడిపోయాయి. దాంతో ఆ దేశంలోని ప్రతి సామాన్యుడిపైన మరింత అధనపు భారం పడనుంది.. ఇక ఈజిప్ట్ లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దేశం తీసుకున్న రుణాలు.. ఆ దేశ జి‌డి‌పి లో 90 శాతానికి చేరుకున్నట్లు సమాచారం. దీన్ని బట్టే తెలుస్తోంది.. ఈజిప్ట్ పై రుణభారం ఏ స్థాయిలో ఉందన్న విషయం. అంతే కాకుండా ఆ దేశంలో ఉన్న అప్పుల కారణంగా విదేశీ పట్టుబడులు సైతం ఆ దేశం నుంచి తరలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక ఉక్రెయిన్ గురించి చెప్పనవసరం లేదు.. రష్యా తో జరిగిన యుద్దం కారణంగా ఆ దేశం పెను ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశానికి జరిగిన నష్టాన్ని పుర్చుకునేందుకు..అమెరికా మరియు యూరప్ దేశాలనుంచి రుణాలు పొందేందుకు అర్థించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక అర్జెంటినా దేశంలో ఆ దేశ కరెన్సీ ” పెసోగా ” భారీగా క్షీణించింది. దాంతో విదేశీ నిల్వలు కూడా భారీగా తగ్గిపోయాయి.. ఈ నేపథ్యంలో అర్జెంటినా కూడా ఆర్థిక సంక్షోభానికి చేరువలో ఉంది. ఇంకా ఇవే కాకుండా నేపాల్, ఇథియోఫియా, కెన్యా వంటి చాలా దేశాలు కూడా ఆర్థిక సంక్షోభానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. మరి ఈ దేశాలలో కూడా శ్రీలంక పరిస్థితులు ఏర్పడితే ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా మారడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు ..!

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

పీకల్లోతు కష్టాల్లో పాక్.. దివాళా అంచున దేశం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -