Thursday, April 25, 2024
- Advertisement -

త్వరలో సూపర్ హ్యూమన్స్ తరం..మానవళికి మరణం తప్ప మరో మార్గం ఉండ‌దు..?

- Advertisement -

టెక్నాల‌జీలో వ‌స్తున్న మార్పుల కార‌ణంగా ప్ర‌పంచం దూసుకుపోతోంది. సైన్స్‌లో వ‌స్తున్న టెక్నాల‌జీ మార్పుల‌తో మ‌నుషుల జీవితాలు శ‌ర వేగంగా మారుతున్నాయి. అవతార్ మూవీ .. చాలామందికి ఈ సినిమాపై ఐడియా ఉంటుంది. సైంటిస్టులు… ఒక కొత్త తరం జీవికి అందులో ప్రాణం పోస్తాయి. అలాంటి సంఘ‌ట‌నలే నిజ‌జీవితంలో నిజం కానున్నాయా..? అద్భుతమైన శక్తులున్న మరో తరం పుట్టనుందా ? అవును మీరు వింటున్న‌ది నిజం. ఇలా అనింది ఎవ‌రో సాదారాణ వ్య‌క్తికాదు.పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేని స్టీఫెన్ హాకింగ్.

ఆయన బతికున్నప్పుడు రాసిన బ్రీఫ్ ఆన్సర్స్ టు ద బిగ్ క్వశ్చన్స్ అనే పుస్తకం రాశారు. ఈ బుక్ త్వరలో మార్కెట్‌లోకి రాబోతుంది. సంపన్నులు తమకెలాంటి పిల్లలు కావాలనుకుంటున్నారో అలాంటివాళ్లకోసం డీఎన్ఏలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నారు. అద్భుతమైన మెమరీ పవర్, అంతులేని మేధో శక్తి , ఎక్కువ జీవితకాలం, వ్యాధి నిరోధకత కూడా ఎక్కువగా ఉండేలా సూపర్ హ్యూమన్స్‌గా తమ సంతతిని వ‌ృద్ధి చేసుకుంటున్నారు. దీంతో మేదో సామార్థ్యాన్ని భావోద్వేగాల్ని మార్పు చేసుకోగల జన్యు సాంకేతికను మన సైంటిస్టులు ఈ శతాబ్ధంలోనే అభివృద్ధి చేయగలరని బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు స్టీఫెన్.

సూపర్ హ్యూమన్స్ జీవం పోసుకున్న తర్వాత సాధారణ మానవళికి మరణం తప్ప మరో మార్గం ఉండదని బ్రీఫ్ ఆన్సర్స్‌టు ద బిగ్ క్వశ్చన్స్ పుస్తకంలో స్టీఫెన్ హెచ్చరించారు. మానవులు జన్యుక్రమంలో మార్పులు చేయడాన్ని నిషేధించేలా చట్టాలు తీసుకురావాలని కూడా ఆయన తెలిపారు.

అత్యాధునిక జన్యు సాంకేతికత సాయంతో అపార మేధోశక్తి సామార్థ్యాలతో్ రూపొందనున్న ఆ సూపర్ హ్యూమన్స్‌తో సాధారణ మనుషులు ఏ విషయంలోను పోటీ పడలేరన్నారు. సూపర్ హ్యూమన్స్ జీవం పోసుకున్న తర్వాత సాధారణ మానవళికి మరణం తప్ప మరో మార్గం ఉండదని బ్రీఫ్ ఆన్సర్స్‌టు ద బిగ్ క్వశ్చన్స్ పుస్తకంలో స్టీఫెన్ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -